ఏడుపాయల మహాజాతరకు వేళాయే.. తేదీలు ఇవే..

మెదక్‌ జిల్లాలోని వనదుర్గమ్మ జాతరకు సర్వం సిద్ధమైంది. మంజీరా నది తీరాన ఏడుపాయల దుర్గా భవాని ఆలయం కొలువై ఉంది. ఏటా మహా శివరాత్రి పర్వదినాన నిర్వహించే ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా విశేష సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఇక మరో వారం రోజుల్లో జాతర స్టార్ట్ కానుంది. 3 రోజులు పాటు కనులపండువగా జరిగే జాతరకు సర్వం సిద్ధం చేస్తున్నారు అధికారులు.

ఏడుపాయల దుర్గా భవాని జాతర తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వైభవంగా జరిగే రెండో అతిపెద్ద జాతర. రాష్ట్రంలో మేడారం, పెద్ద గట్టు జాతర తర్వాత ఆ స్థాయిలో ప్రాచుర్యం పొందింది. ఇక ఈ ఏడాది ఫిబ్రవరి 15- 17 వరకు మూడు రోజుల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం , ఆలయ కమిటీ సమాయత్తం అవుతోంది.

ఈ జాతర ఏటా మూడు రోజుల పాటు జరుగుతుంది. జాతరలో భాగంగా మొదటి రోజు మహాశివరాత్రి సందర్భంగా భక్తులు మంజీరా నదిలో పుణ్య స్నానాలు ఆచరిస్తారు. దుర్గా భవానిని దర్శించుకుంటారు. ఇక రెండో రోజు ప్రధాన ఘట్టమైన బండ్ల ఉత్సవం అత్యంత కోలాహలంగా సాగుతుంది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తమ ఎడ్ల బండ్లను రంగురంగుల పూలతో.. లైట్లతో అలంకరిస్తారు. ఇక ఆఖరి రోజు రథోత్సవంతో ఈ మహా క్రతువు ముగుస్తుంది.

Yedupayala Mahajathara will Begin soon Three-Day Mahashivaratri Brahmotsavams from Feb 15-17

ఈ జాతరకు ఆ పేరు ఎలా వచ్చిందంటే..? మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగ్‌ సాన్‌ పల్లి వద్ద మంజీరా నది ఏడు పాయలుగా విడిపోయి ప్రవహిస్తుంది. వేద కాలం నాటి పురాణాల ప్రకారం, జనమేజయుడు చేసిన సర్పయాగ ఫలాన్ని స్వీకరించడానికి సప్తర్షులు ఏడు పాయలుగా మారి ఇక్కడ ప్రవహించారని భక్తుల నమ్మకం. అందుకే దీనికి 'ఏడుపాయలు' అనే పేరు వచ్చింది. ఇక ఈ జాతరకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్రల నుండి కూడా దాదాపు 15 లక్షల మందికి పైగా భక్తులు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+