తన ప్రేమను అంగీకరించలేదని ఫ్యాకల్టీపై పగ: న్యూడ్ ఫొటోలు పెట్టి, కటకటాల పాలైంది
ప్రభుత్వ ఉన్నతాధికారి కావాలనే ఉద్దేశంతో ఓ కోచింగ్ ఇనిస్టిట్యూట్‌లో చేరిన ఓ యువతి చెడు ఆలోచనలు, తీవ్రమైన కోరికలతో తన జీవితాన్ని నాశనం చేసుకుంది. తనకు ఇనిస్టిట్యూట్‌లో సబ్జెక్టు బోధించే ప్రొఫెసర్‌పైనే మనసుపారేసుకుంది. తాను ప్రేమిస్తున్నానని, తనను పెళ్లి చేసుకోవాలని అతడ్ని కోరింది. అయితే, తనకు అప్పటికే పెళ్లైందని, పిల్లలు కూడా ఉన్నారని సదరు ప్రొఫెసర్ ఆమె ప్రేమ పెళ్లి ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించారు.
ఈ నేపథ్యంలో తన దృష్టిని ఉద్యోగ లక్ష్యంవైపు కొనసాగించాల్సిన యువతి.. అలా కాకుండా తన ప్రేమను తిరస్కరించిన సదరు ప్రొఫెసర్‌పై పగను పెంచుకుంది. అతని భార్య, రెండేళ్ లకూతురు ఫొటోలను మార్ఫింగ్ చేసి ఫేక్ ఎకౌంట్స్ ద్వారా సోషల్ మీడియాలో వారి న్యూడ్ ఫొటోలను పోస్టులు పెట్టింది. గుర్తించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో ఆ యువతి కటకటాలపాలైంది.

హైదరాబాద్ నగరంలోని అశోక్‌నగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. అనంతపురం జిల్లాకు చెందిన లక్ష్మీ అనే యువతి గ్రూప్-1 పరీక్ష రాసింది. సివిల్స్ కోసం అశోక్‌నగర్‌లో కోచింగ్ తీసుకుంటోంది. ఈ క్రమంలో ఐఏఎస్ కోచింగ్ సెంటర్‌లోని ఓ ఫ్యాకల్టీపై మనసు పారేసుకుంది. తాను ప్రేమిస్తున్నానని, తనను పెళ్లి చేసుకోవాలని ఆయనను కోరింది.
అయితే, తనకు ఇప్పటికే వివాహం జరిగిందని, పిల్లలు కూడా ఉన్నారని ఆమెకు సదరు ప్రొఫెసర్ చెప్పాడు. ఆమె ప్రేమ పెళ్లి ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించాడు. ఈ క్రమంలోనే అతనిపై పగను పెంచుకున్న నిందిత యువతి.
సెకండ్ హ్యాండ్ ఫోన్లు కొనుగోలు చేసి.. యాచకుల పేరుతో సిమ్ కార్డులను తీసుకుంది. ఫేక్ సోషల్ మీడియా అకౌంట్స్ క్రియేట్ చేసింది.
సదరు ప్రొఫెసర్ కుటుంబంలోని వ్యక్తుల ఫొటోలను అసభ్యకరంగా చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేసి అతడ్ని బెదిరింపులకు గురిచేసింది. ఈ నేపథ్యంలో బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితురాలిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.












Click it and Unblock the Notifications