యువతి గొంతు కోసిన ప్రేమోన్మాది; హైదరాబాద్ బోరబండలో దారుణం!!
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం నడిబొడ్డున దారుణ ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ నగరంలోని బోరబండలో ఓ యువతిపై కిషోర్ అనే యువకుడు అత్యంత దారుణంగా దాడి చేసి గొంతు కోసిన ఘటన చోటుచేసుకుంది. బోరబండ పరిధిలోని బంజారా నగర్ లో జరిగిన ఈ దారుణ ఘటన వివరాల్లోకి వెళితే..
కొంతకాలంగా ప్రేమిస్తున్నానని కిషోర్ అనే యువకుడు ఒక యువతి వెంటపడ్డాడు. గత ఏడు సంవత్సరాలుగా బొరబండ ప్రాంతంలో నివాసముంటున్న యువతిని ప్రేమిస్తున్నానని వెంటపడుతున్నాడు. అయితే ఆ యువతి అతని ప్రేమను నిరాకరించడంతో యువతిపై ద్వేషం పెంచుకున్న యువకుడు ఆమెను అనేకమార్లు బెదిరించాడు. తనను ప్రేమించుకుంటే చంపేస్తానంటూ వార్నింగ్ ఇచ్చాడు. అయినా ఆ యువతి అతని బెదిరింపులకు భయపడకుండా అతడిని ప్రేమించటం లేదని, ప్రేమను నిరాకరించింది.

దీంతో ఆమెపై ఊహించని విధంగా దాడి చేశాడు. ఈరోజు సాయంత్రం యువతిని ఆమె పనిచేసే కార్యాలయం నుండి స్కూటీపై ఇంటికి వస్తుండగా కళ్లలో కారం కొట్టి అందరూ చూస్తుండగా ప్రేమను నిరాకరించినందుకు యువతి గొంతు కోశాడు. కిషోర్ చేసిన దాడిలో యువతి తీవ్రంగా గాయపడింది. అందరూ చూస్తుండగానే ప్రేమోన్మాది ఈ దారుణ ఘటనకు పాల్పడ్డాడు.
స్థానికులు వెంటనే యువతిని ఆసుపత్రికి తరలించారు. కిషోర్ ను పట్టుకుని చితకబాదారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కిశోర్ ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమను నిరాకరిస్తే ఇటువంటి దారుణ ఘటనలకు పాల్పడటం అటు అమ్మాయి జీవితాన్నే కాదు, దాడికి పాల్పడిన వాడి జీవితాన్ని కూడా నాశనం చేస్తుంది.
ప్రేమను తిరస్కరించారని ఉన్మాదులు యువతులు, బాలికలపై పాశవికంగా దాడులు చేస్తూనే ఉన్నారు. ఇటువంటి సంఘటనలు జరగకుండా అమ్మాయిలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. తమను ఎవరైనా ఇబ్బంది పెడుతున్న ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటే సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే పోలీసులు వారిపై చర్య తీసుకోవడమో, కౌన్సిలింగ్ ఇవ్వడమో చేస్తారు. ఇక ఇదే సమయంలో యువకులు కూడా ఈ తరహా దాడులకు దిగితే వారి భవిష్యత్తు సర్వ నాశనం అవుతుందన్న విషయం గుర్తించాలి.
-
హైదరాబాద్ కు మరో మణిహారం..దేశంలోనే రెండో నెట్ఫ్లిక్స్ ఆఫీస్ ప్రారంభం.. ఎప్పుడంటే! -
"బీరు"తో పాటు బాటిల్ లోపలే స్టఫ్.. బిత్తరపోయిన మందుబాబు !! -
మహిళలను వేధిస్తే ఇక అంతే.. సీఎం రేవంత్ సీరియస్ వార్నింగ్ ! -
విజయవాడలో పోలీసులపై గన్ తో కాల్పులు, వరంగల్ వ్యక్తి అరెస్ట్ -
ఐఎండీ హెచ్చరిక: 40డిగ్రీలు దాటి ఈ జిల్లాలలో నిప్పుల కుంపటిలా ఎండలు! -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!!












Click it and Unblock the Notifications