పెళ్లి జరగట్లేదని అంత పని చేస్తారా.. హైదరాబాద్‌లో యువతి ఏం చేసిందంటే ?

హైదరాబాద్ లోని కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఓ విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తల్లికి ఉన్న వైకల్యం కారణంగా తన వివాహం కుదరడం లేదనే మనోవేదనతో ఓ యువతి ప్రాణాలు కోల్పోయిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీంతో ఈ వ్యవహారం నగర వ్యాప్తంగానే కాకుండా తెలంగాణ మొత్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది.

ఏం జరిగిందంటే..

పోలీసుల వివరాల ప్రకారం.. మేడ్చల్ జిల్లా కండ్లకోయకు చెందిన తోష్నివాల్ విజయలక్ష్మి (26) చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయింది. ఆమె తల్లి సరస్వతికి మతిస్థిమితం సరిగా లేకపోవడంతో.. సంరక్షణ మొత్తం విజయలక్ష్మి భుజాలపైనే పడింది. ప్రస్తుతం వీరు కూకట్‌పల్లి పరిధిలోని మైత్రినగర్‌లో నివసిస్తున్నారు. కాగా ప్రస్తుతం ఐటీ సంస్థలో ఉద్యోగం చేస్తున్న విజయలక్ష్మి, తల్లిని ఎంతో ఆప్యాయంగా చూసుకుంటూ అన్నీ తానై సపర్యలు చేస్తూ ఉండేది. తల్లిని తన కంటికి రెప్పలా కాపాడుకుంటూ, ఆమెకు ఎలాంటి లోటు లేకుండా చూసుకునే ప్రయత్నం చేసేది. ఈ క్రమంలో ఇటీవల ఆమెకు కొన్ని వివాహ సంబంధాలు వచ్చినప్పటికీ, తల్లి తనతోపాటే ఉండాలని ఆమె పెట్టిన నిబంధన కారణంగా అవి కుదరలేదని తెలుస్తోంది.

young-women-committed-suicide-at-hyderabad-due-to-frustration-of-not-being-able-to-get-married-by-he

దీంతో విజయలక్ష్మి తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ మనోవేదనతో శనివారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు ఆమె కోసం వెతికినా ఆచూకీ లభించలేదు. ఆమె సమీప బంధువు అభిషేక్ ఆదివారం కూకట్‌పల్లి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో, పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేసి గాలింపు చర్యలు ప్రారంభించారు.

అయితే ఈలోగా సోమవారం హుసేన్‌సాగర్‌లో ఓ యువతి మృతదేహం తేలినట్లు లేక్ పోలీసులు గుర్తించారు. ఈ సమాచారాన్ని లేక్ పోలీసులు కూకట్‌పల్లి పోలీసులకు తెలియజేయగా, అక్కడికి చేరుకున్న అధికారులు మృతదేహాన్ని పరిశీలించి అది అదృశ్యమైన విజయలక్ష్మిదేనని నిర్ధారించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ విషాద ఘటన మానసిక ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు యువతపై ఎంతటి ప్రభావం చూపుతాయో మరోసారి తెలియజేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవారు ఒంటరిగా బాధను మోసుకోకుండా కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా నిపుణుల సహాయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+