హాస్టల్ గదిలో యువకుడి దారుణ హత్య: పక్కనే లిక్కర్ బాటిళ్లు(పిక్చర్స్)
హైదరాబాద్: నగరంలోని కూకట్ పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తాను ఉంటున్న హాస్టల్ గదిలోనే ఓ యువకుడిని దుండగులు దారుణంగా హత్య చేశారు.
కూకట్‌పల్లి సీఐ పురుషోత్తం తెలిపిన ప్రకారం.. రంగారెడ్డి జిల్లా వికారాబాద్ మండలం గిర్గిట్‌పల్లి గ్రామానికి చెందిన కడియాల గోపి అలియాస్ గోపీనాథ్(28) కూకట్‌పల్లి వివేకానందనగర్‌లోని అనిల్స్ బాయ్స్ హాస్టల్‌లో ఉంటున్నాడు.
ఇతడు వృత్తిపరంగా లిఫ్ట్‌లు బాగు చేస్తుంటాడు. కాగా, ఇతను ఉంటున్న గదిలోనే శౌర్యారెడ్డి అనే వృద్ధుడు కూడా ఉంటున్నాడు. మూడు రోజుల క్రితం శౌర్యారెడ్డి ఊరేళ్లడంతో ప్రస్తుతం గోపీ ఒక్కడే ఉన్నాడు.
బుధవారం రాత్రి హాస్టల్‌కు వచ్చిన ఇతడు భోజనం చేసి గదిలోకి వెళ్లాడు. గురువారం ఉదయం చూసేసరికి అతన్ని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసి ఉండటంతో హాస్టల్ నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు.
కాగా, గోపీ ఉంటున్న గది మొదటి అంతస్తులో ఉంది. కాపాలదారుల కళ్లు గప్పి దుండగులు నేరుగా అతని గదికి వచ్చి హత్య చేసి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతనికి తెలిసిన వారే ఈ హత్యకు పాల్పడి ఉంటారని కూడా అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

హత్యకు గురైన యువకుడు
హైదరాబాద్ నగరంలోని కూకట్ పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తాను ఉంటున్న హాస్టల్ గదిలోనే ఓ యువకుడిని దుండగులు దారుణంగా హత్య చేశారు.

హాస్టల్ గదిలో హత్యకు గురైన గోపి
కూకట్‌పల్లి సీఐ పురుషోత్తం తెలిపిన ప్రకారం.. రంగారెడ్డి జిల్లా వికారాబాద్ మండలం గిర్గిట్‌పల్లి గ్రామానికి చెందిన కడియాల గోపి అలియాస్ గోపీనాథ్(28) కూకట్‌పల్లి వివేకానందనగర్‌లోని అనిల్స్ బాయ్స్ హాస్టల్‌లో ఉంటున్నాడు.

గదిలో మద్యం బాటిళ్లు
ఇతడు వృత్తిపరంగా లిఫ్ట్‌లు బాగు చేస్తుంటాడు. కాగా, ఇతను ఉంటున్న గదిలోనే శౌర్యారెడ్డి అనే వృద్ధుడు కూడా ఉంటున్నాడు. మూడు రోజుల క్రితం శౌర్యారెడ్డి ఊరేళ్లడంతో ప్రస్తుతం గోపీ ఒక్కడే ఉన్నాడు.

పోలీసుల దర్యాప్తు
బుధవారం రాత్రి హాస్టల్‌కు వచ్చిన ఇతడు భోజనం చేసి గదిలోకి వెళ్లాడు. గురువారం ఉదయం చూసేసరికి అతన్ని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసి ఉండటంతో హాస్టల్ నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు.

Click it and Unblock the Notifications