ప్రతి ఒక్కరూ ఆయనను ఆదర్శంగా తీసుకోవలి, స్ఫూర్తిపొందాలి- చిరంజీవి
నేడు సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ 150వ జయంతి. ప్రతి సంవత్సరం ఈ రోజును జాతీయ సమైక్యత దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా ఢిల్లీలోని పటేల్ సమాధికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, పలువురు కేంద్ర మంత్రులు నివాళి అర్పించారు. దేశ మొట్టమొదటి ఉప ప్రధానమంత్రిగా ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. ప్రతి ఒక్కరూ ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ లో జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. వడోదర జిల్లాలో నర్మద నదీ తీరంలో నిర్మించిన అతి ఎత్తయిన వల్లభ్ భాయ్ పటేల్ విగ్రహానికి నివాళి అర్పించారు. శ్రద్ధాంజలి ఘటించారు. అక్కడ నిర్మించిన మ్యూజియాన్ని సందర్శించారు. అనంతరం ఫొటో ఎగ్జిబిషన్ ను తిలకించారు. పోలీసులు, భద్రత సిబ్బంది పరేడ్ లో పాల్గొన్నారు. గౌరవ వందనాన్ని స్వీకరించారు.

జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లో నెక్లెస్ రోడ్ లో ఏర్పాటైన కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ పోలీస్ డైరెక్టర్ జనరల్ బీ శివధర్ రెడ్డి, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ సహా పలువురు ప్రముఖులు ఇందులో పాల్గొన్నారు. నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. వల్లభ్ భాయ్ పటేల్ గొప్పదనాన్ని గుర్తు చేసుకున్నారు.
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, సర్దార్ పటేల్ చెప్పిన 'భిన్నత్వంలో ఏకత్వం' అనే సూక్తిని కొనియాడారు. "భిన్నత్వంలో ఏకత్వం అనేది సర్దార్ పటేల్ ఇచ్చిన అద్భుతమైన సూక్తి. మనం ఆ స్ఫూర్తితోనే ముందుకు వెళ్తున్నాం," అని ఆయన అన్నారు. సర్దార్ పటేల్ గొప్ప సందేశం నుంచి యువత స్ఫూర్తి పొందాలని చిరంజీవి పిలుపునిచ్చారు. ప్రతి యువతీ యువకుడు సర్దార్ పటేల్ గొప్ప సందేశం నుండి స్ఫూర్తి పొందాలని అన్నారు.












Click it and Unblock the Notifications