నయీం వార్తలు చదివి, అలా కావాలని..: బెదిరించి, పోలీసులకు చిక్కాడు

నల్గొండ: ఈజీ మనీ కోసం ఓ యువకుడు గ్యాంగ్ స్టర్ నయీంను ఆదర్శంగా తీసుకున్నాడు. ఇటీవల షాద్ నగర్‌లో గ్యాంగ్ స్టర్ నయీం పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన విషయం తెలిసిందే. అతని గురించి చదివిని ఓ యువకుడు ఆయనను ఫాలో అవ్వాలనుకున్నాడు.

అదే స్థాయిలో డబ్బులు సంపాదించాలనుకున్నాడు. అనుకున్న వెంటనే పలువురు వ్యాపారాలను డబ్బుల కోసం బెదిరించాడు. పైగా అతను, నయీం ప్రధాన అనుచరుడిగా పేరున్న శేషన్న పేరును వ్యాపారులను బెదిరించడానికి ఉపయోగించుకున్నాడు.

Youth threaten with the name of Nayeem, arrested

నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం గురజాలకు చెందిన సతీష్ సులభంగా డబ్బు సంపాదించేందుకు ఈ మార్గాన్ని ఎంచుకున్నాడు. నయీం అనుచరుడు శేషన్న పేరుతో మహబూబ్ నగర్‌లో పలువురు వ్యాపారులను బెదిరించగా, వారు పోలీసులను ఆశ్రయించారు. కల్వకుర్తి పోలీసులు గురువారం నిందితుడిని అరెస్టు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+