టిలో జగన్‌కు క్రేజ్: ఏడ్చిన తల్లికి ఓదార్పు (పిక్చర్స్)
వరంగల్: ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా నేత భీంరెడ్డి సుధీర్ రెడ్డి కుటుంబానికి అండగా ఉంటానని ఆ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆయన కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని ఆయన సోమవారం అన్నారు. హన్మకొండ రెడ్డి కాలనీలో సుధీర్ రెడ్డి కుటుంబాన్ని జగన్ పరామర్శించారు.
సుధీర్ రెడ్డి తల్లితండ్రులు ఎల్లారెడ్డి - అరుణాదేవిలను ఓదార్చారు. తమ కుమారుడు బతికి ఉన్న కాలంలో సొంత కుటుంబాని కంటే జిల్లాలో పార్టీని పటిష్ఠం చేయడంపైనే ఎక్కువ శ్రద్ధ చూపాడని సుధీర్ రెడ్డి తల్లి విలపిస్తూ చెప్పారు. జగన్ ఆమెను ఓదార్చుతూ... సుధీర్ రెడ్డి పార్టీకి చేసిన సేవలను కొనియాడారు. జగన్ అరగంట పాటు వారి వద్ద ఉన్నారు.
జగన్ వెంట వైసీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షర్మిలా సంపత్‌రావు తదితరులు ఉన్నారు. అంతకుముందు జిల్లాకు వచ్చిన జగన్‌కు అభిమానులు ఘన స్వాగతం పలికారు. జగన్‌ను చూసేందుకు చాలామంది తరలి వచ్చారు. ఓదార్పు కోసం వచ్చినందున భారీగా ఫ్లెక్సీలు పెట్టవద్దని, బ్యానర్స్ వద్దని చెప్పినట్లుగా తెలుస్తోంది.

ఓదార్పు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం నాడు సుధీర్ రెడ్డి తల్లిని ఓదార్చుతున్న దృశ్యం.

ఓదార్పు
ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా నేత భీంరెడ్డి సుధీర్ రెడ్డి కుటుంబానికి అండగా ఉంటానని ఆ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు.

ఓదార్పు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం నాడు సుధీర్ రెడ్డి తల్లిని ఓదార్చుతున్న దృశ్యం.

జగన్
జగన్‌ను చూసేందుకు చాలామంది తరలి వచ్చారు. ఓదార్పు కోసం వచ్చినందున భారీగా ఫ్లెక్సీలు పెట్టవద్దని, బ్యానర్స్ వద్దని చెప్పినట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications