YSRTP: ఎన్నికల బరిలో బ్రదర్ అనిల్ - రెండు స్థానాల్లో షర్మిల పోటీ..!!
తెలంగాణ ఎన్నికల వేళ రాజకీయం వేడెక్కుతోంది. బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలోకి దిగింది. ఇతర పార్టీలు అభ్యర్దుల ఖరారులో నిమగ్నమయ్యారు. కాంగ్రెస్ లో తన పార్టీ విలీనం..ఆ పార్టీ నుంచే పోటీ కోసం నాలుగు నెలలు ప్రయత్నించిన షర్మిల..ఇప్పుడు ఎవరితో పొత్తులు లేకుండా పోటీకి సిద్దమయ్యారు. వచ్చే ఎన్నికల్లో 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. రెండు చోట్ల షర్మిల పోటీకి సిద్దం అయ్యారు. బ్రదర్ అనిల్ ఎన్నికల బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.
పాలేరు నుంచి షర్మిల:వైఎస్సార్టీపీ ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగుతుందని షర్మిల ప్రకటించారు. కాంగ్రెస్ లో విలీనం ప్రతిపాదన చేసి..మంతనాలు జరిగినా..షర్మిల ప్రతిపాదనలపైన సానుకూలత రాలేదు. దీంతో..షర్మిల ఒంటరి పోరుకు నిర్ణయించారు. వచ్చే ఎన్నికల్లో షర్మిల ముందుగా ప్రకటించిన విధంగా ఖమ్మం జిల్లా పాలేరు నుంచి పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. మరో స్థానం నుంచి పోటీ చేస్తానని చెప్పారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ నుంచి షర్మిల పోటీకి ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. విజయమ్మ సైతం ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనే డిమాండ్ ఉందని షర్మిల చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో బ్రదర్ అనిల్ కూడా పోటీ చేయాలని డిమాండ్ ఉందని షర్మిల పేర్కొన్నారు.

అసెంబ్లీ బరిలో బ్రదర్ అనిల్:బ్రదర్ అనిల్ ఇప్పటి వరకు ఎన్నికల్లో ఎక్కడా పోటీ చేయలేదు. షర్మిల పార్టీ ప్రారంభం నుంచి మద్దతుగా నిలిచారు. ఇక, వచ్చే ఎన్నికల్లో బ్రదర్ అనిల్ సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే ప్రచారం సాగుతోంది. అవసరం అయితే విజయమ్మ పోటీ చేస్తారని షర్మిల స్పష్టం చేసారు. తన పార్టీకి గొప్ప చరిత్ర లేకపోవచ్చు.. ప్రజల కోసం పోరాటాలు చేశానని షర్మిల చెప్పారు.
మొట్టమొదట నిరుద్యోగుల కోసం దీక్షలు చేసింది తన పార్టీనేని వెల్లడించారు. కాంగ్రెస్ తో వెళ్తే వ్యతిరేక ఓటు చీలదు.. బీఆర్ఎస్ కు లాభం జరగవద్దని అనుకున్నామని..దీని కోసం నాలుగు నెలల పాటు నిరీక్షించామని వివరించారు. తెలంగాణ ప్రజల కోసం త్యాగానికి సిద్దం అయ్యానని చెప్పిన షర్మిల..ఇప్పుడు మనకు మంచే జరిగిందని పార్టీ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

అభ్యర్దుల ఎంపికపై కసరత్తు:ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చామనే అపవాదు రాకుండా త్యాగానికి సిద్దం అయ్యానని షర్మిల చెప్పుకొచ్చారు.ఇదే సమయంలో మరి కొన్ని నియోజకవర్గాలకు అభ్యర్దులు ఖరారు అయినట్లు తెలుస్తోంది. కొంత కాలం పార్టీ బాధ్యతలు చూస్తున్న ఇంజం నర్సిరెడ్డి, ఈ ప్రాంతంపై పట్టున్న వైఎఎస్సార్టీపి కీలక నేత తూడి దేవేందర్‌రెడ్డి ఇప్పటికే మిర్యాలగూడలో ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
మిర్యాలగూడతోపాటు సూర్యాపేటలో పిట్ట రామిరెడ్డి, కోదాడలో పచ్చిపాల వేణు, భువనగిరిలో అథహర్‌లను బరిలో దింపాలని పార్టీ అధినేత్రి షర్మిల ఇప్పటికే నిర్ణయించినట్టు సమాచారం. అయితే, షర్మిల ఏ మేర ఓట్లు సాధిస్తారు.. ఫలితాలు ఏంటీ...ఏ పార్టీ మీద ప్రభావం ఉంటుందనే చర్చలు మొదలయ్యాయి.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!!












Click it and Unblock the Notifications