ఎవడెట్లపోయినా మీరు సల్లంగుండాలె? .. సంబరాలు చేసుకోవాలె !! : కెసిఆర్‌కు షర్మిల బర్త్ డే విషేస్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 68వ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు దేశ వ్యాప్తంగా ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. మీరెప్పుడూ ఆయురోగ్యాలతో జీవించాలని ప్రార్థిస్తున్నా అంటూ ప్రధాని మోదీ ట్విట్ చేశారు. స్వయంగా కేసీఆర్‌కి ఫోన్ చేసి బర్త్ డే విషేస్ తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, అస్సాం హిమంత బిశ్వశర్మ, టీడీపీ అదినేత చంద్రబాబు, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, హీరో చిరంజీవి తదితరులు కేసీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు.

కేసీఆర్ సల్లంగుండాలె?..
ఈ నేపథ్యంలో వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తనదైన స్టైల్లో బర్త్ డే విషేస్ తెలిపారు. ఎవడెట్లపోయినా మీరు మాత్రం సల్లంగుండాలె?.. మీరు రోజుల తరబడి సంబరాలు చేసుకోవాలె అంటూ పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ చురకలంటించారు. కేసీఆర్ పాలనపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు.
కొత్త రాజ్యాంగం రాయాలనుకునే దొరగారూ..
ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులను, ఉద్యోగాల కోసం చస్తున్న నిరుద్యోగులను పట్టించుకోకుండా పట్టించుకోవడం లేదని షర్మిల విమర్శించారు. అప్పుల కుప్పలను గొప్పలుగా చెప్పుకుంటన్నారు. దేశరాజకీయాల్లో చక్రం తిప్పాలనుకొంటూ, అంబేడ్కర్ రాజ్యాంగం గడీల పాలనకు అడ్డొస్తుందని కొత్తరాజ్యాంగం రాయాలనుకునే దొరగారూ, మీరు పుట్టినరోజు వేడుకలు చేసుకోండి అంటూ ఎద్దేవా చేశారు.

రోజుకొక రైతు చస్తున్నా...
రాష్ట్రంలో రోజుకొక రైతు చస్తున్నా, వారానికో నిరుద్యోగి తల్లికి గర్భశోకం మిగిలిస్తున్నా, పంటనష్టపోయి అప్పులపాలవుతూ, కాలికిందున్న భూమి కంటికి కనిపిస్తలేదని, రోజుకో తీరుగ అణిచివేయబడుతున్నా, జనాలు అరిగోసల పాలవుతున్నా, మీరు రోజుల తరబడి సంబరాలు చేసుకోవాలె . ఎవడెట్లపోయినా మీరు మాత్రం సల్లంగుండాలె? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి రోజు ఎదో ఒక అంశంపై తెలంగాణ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు షర్మిల.. తాజాగా మరొసారి కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా చురకలంటిస్తూ ట్విట్ చేశారు.












Click it and Unblock the Notifications