వైయస్ షర్మిళ దూకుడు.!పేపర్ లీకేజ్ వ్యవహారంలో గవర్నర్‌కు లేఖ.!టీ సర్కార్ పై ఫిర్యాదు.!

హైదరాబాద్ : వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల తెలంగాణ ప్రభుత్వంపై మరొక్క సారి మండిపడ్డారు. ప్రశ్నా పత్రాల లీకేజీ వ్యవహారంలో ప్రభుత్వ చర్యలు నామమాత్రంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేసారు. వేగంగా దర్యాప్తు జరిపించి దోషులను కఠినంగా శిక్షించాల్సిన ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తూ విద్యార్థుల, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోందని ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో గవర్నర్ కు లేఖ రాసారు షర్మిళ. ఆర్టికల్ 317 ప్రకారం టీఎస్పీఎస్సీ బోర్డ్ రద్దుకు రాష్ట్రపతికి సిఫార్సు చేయాలని, కొత్త బోర్డ్ వెంటనే ఏర్పాటు చేసేలా చూడాలని లేఖలో షర్మిళ విజ్ఞప్తి చేసారు.

విద్యార్ధులను, నిరుద్యోగులను ఆదుకోండి.. గవర్నర్ కు వైయస్ షర్మిళ లేఖ..
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో పేపర్ లీకుల వ్యవహారం లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలను కుదిపేసిందన్నారు వైయస్ షర్మిళ. ఇది దేశంలోనే ఒక కమిషన్ లో జరిగిన అతిపెద్ద స్కాంగా అభివర్ణించారు. సంతలో సరుకులు అమ్మినట్లుగా కీలకమైన పరీక్షా పేపర్లు అమ్మి 30లక్షల మంది జీవితాలతో చెలగాటం ఆడారని అన్నారు. ఈ పేపర్ లీకుల వెనుక బోర్డ్ చైర్మన్, మెంబర్లు, ఉద్యోగుల నుంచి రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రుల వరకు హస్తం ఉందని తాము భావిస్తున్నామని లేఖలో షర్మిళ పేర్కొన్నారు.

sharmila

నామమాత్రంగా లీకుల విచారణ.. గవర్నర్ జోక్యం చేసుకోవాలన్న షర్మిళ
అత్యంత భద్రంగా ఉండాల్సిన పరీక్షా పత్రాలు, అందులో గ్రూప్-1 లాంటి ఉన్నత స్థాయి ఉద్యోగాల పత్రాలు లీక్ కావడం అంటే ఇది ఎంత పెద్ద స్కామో అవగతం అవుతున్నదన్నారు. ప్రభుత్వ పెద్దల ప్రోద్బలం లేకుండా ఇలా జరగడం అసాధ్యమన్నారు షర్మిళ. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీఎస్పీఎస్సీ పూర్తి విశ్వసనీయతను కోల్పోయిందని షర్మిళ లేఖలో ఆవేదన వ్యక్తం చేసారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై రాష్ట్ర ప్రభుత్వ హయాంలో నియమించిన సిట్ పనితీరు నమ్మశక్యంగా లేదని, కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఈ కేసులో కిందిస్థాయి ఉద్యోగులను బలి చేస్తున్నారన్నారు షర్మిళ.

దేశంలో అతాపెద్ద కుంభకోణం.. లోతైన విచారణ జరిపించాలన్న షర్మిళ
ఎన్నికలు దగ్గర పడడంతో ఉద్యోగాలు ఇవ్వలేదనే మచ్చను తుడిపేసుకునేందుకు నిరుద్యోగుల జీవితాలతో ఈ ప్రభుత్వం ఆటలు ఆడుకుంటుందని షర్మిళ తెలిపారు. ఇప్పటికే అన్ని పేపర్లు లీక్ అయినా.. అదే పాత కమిషన్ నుంచే పరీక్షలు పెడితే పేపర్లు లీక్ కావన్న గ్యారెంటీ లేదని, కనీసం ఒక విజిలెన్స్ సైతం ఏర్పాటు చేయలేదని, పేపర్ లీకుల విషయంలో ఇంటి దొంగలను పట్టుకోకుండా వారితోనే పరీక్షలు నిర్వహించడం ఆమోదకరమైన నిర్ణయం కాదన్నారు షర్మిళ.

టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేయించాలి.. గవర్నర్ రాసిన లేఖలో షర్మిళ విజ్ఞప్తి..
టీఎస్పీఎస్సీ పేపర్ లీకుల అంశాన్ని సీఎం చంద్రశేఖర్ రావు ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని, అందుకే సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణకు అంగీకరించడం లేదని లేఖలో ఘాటు ఆరోపణలు చేసారు. చైర్మన్ ను మార్చడం లేదని, బోర్డు రద్దు చేయడం లేదని, బోర్డును ప్రక్షాళన కూడా చేయకపోవడం దురదృష్టకరం అన్నారు. అందుకే రాష్ట్ర గవర్నర్ తన విచక్షణాధికారాలు ఉపయోగించి బోర్డు రద్దు చేసేలా చూడాలని లేఖలో పేర్కొన్నారు. 30 లక్షల మంది జీవితాలు గవర్నర్ నిర్ణయం మీద ఆధారపడి ఉన్నాయని, తక్షణం బోర్డు రద్దు కోసం సిఫారసు చేసి, కొత్త బోర్డు ఏర్పాటు చేసే దిశగా తోడ్పాటు అందించి, నిరుద్యోగులకు న్యాయం చేస్తారని భావిస్తున్నామని షర్మిళ గవర్నర్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+