హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అయ్యా కేసీఆర్ సారూ .. ఇకనైనా నిద్ర లేవండి, అక్కగా నిరుద్యోగులకూ వైఎస్ షర్మిల విజ్ఞప్తి

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో కొత్త పార్టీతో రాజకీయ ప్రభంజనం సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నదివంగత సీఎం వైయస్ రాజశేఖరరెడ్డి తనయ వైయస్ షర్మిలా రెడ్డి ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం తాను ఎంతటి పోరాటానికైనా సిద్ధమని ఆమె ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రంలో రాజన్నరాజ్యం తెస్తానని చెప్పి రాజకీయ ఆరంగేట్రం చేస్తున్న షర్మిల శ్రీకాంత్ అనే నిరుద్యోగి నోటిఫికేషన్లు రాలేదని ఆత్మహత్యకు పాల్పడిన విషయమై ట్విట్టర్ వేదికగా స్పందించారు.

 ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎంతటి పోరాటానికైనా తాను సిద్ధం

ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎంతటి పోరాటానికైనా తాను సిద్ధం

అక్కగా చెప్తున్నానిరుద్యోగులు ఎవరూ అధైర్యపడొద్దు అంటూ,ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎంతటి పోరాటానికైనా తాను సిద్ధంగా ఉన్నానని చెబుతూ, మీ అక్కగా నేను కోరేది ఒక్కటే దయచేసి ఎవ్వరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దు అంటూ షర్మిల విజ్ఞప్తి చేశారు. రేపటి భవిష్యత్తు కోసం నేడు మార్పు తేవాల్సిందే ..ఆమార్పు కోసం మనం కలిసి పోరాడుదాం అంటూ షర్మిల ట్వీట్ చేశారు. అంతేకాదు ఉద్యోగ నోటిఫికేషన్లు లేవని, ఇక వచ్చే అవకాశమే లేదని ఎవరూ బాధపడకూడదని,నోటిఫికేషన్లు ఇచ్చేవరకు పోరాటం చేద్దామని షర్మిల పేర్కొన్నారు.

నిరుద్యోగులకు అండగా.. శ్రీకాంత్ అనే నిరుద్యోగి ఆత్మహత్యపై ట్వీట్

నిరుద్యోగులకు తాను అండగా ఉంటానని పేర్కొన్న షర్మిల కెసిఆర్ పై ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఒత్తిడి తెస్తున్నారు. ఇప్పటికే ఆమె నిరుద్యోగుల కోసం దీక్ష కూడా చేశారు. నల్గొండ జిల్లాకు చెందిన శ్రీకాంత్ అనే పీజీ విద్యార్థి ఉద్యోగ నోటిఫికేషన్లు లేకపోవడంతో తీవ్ర మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు అన్న ఈ వార్తను ట్విట్టర్ వేదికగా తెలియజేసిన షర్మిల రాష్ట్రంలోని సమస్యలపై పోరాడుతానని, ముఖ్యంగా నిరుద్యోగ యువతకు తాను అండగా ఉంటానని స్పష్టం చేశారు.

అయ్యా కేసీఆర్ సారు.. అంటూ షర్మిల ట్వీట్

ఇదే సమయంలో ఆమె కేసీఆర్ ను టార్గెట్ చేసి ట్వీట్ చేశారు. అయ్యా కేసీఆర్ సారు.. "కనీసం మీ పార్టీ పుట్టిన రోజైనా చస్తే మా నిరుద్యోగులను గుర్తిస్తారేమోనని" నోటిఫికేషన్లు లేక మనస్థాపానికి గురై నల్గొండ నిరుద్యోగి శ్రీకాంత్ నిన్న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇకనైనా నిద్ర లేవండి. ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వండి. నిరుద్యోగ హత్యలు ఆపండి అంటూ తీవ్ర ఆవేదనతో వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు .

Recommended Video

Ys Jagan యాక్షన్ కి లోకేష్ రియాక్షన్ | విద్యార్థుల భవిష్యత్తుకి సీఎం భరోసా || Oneindia Telugu
దీక్ష కూడా చేసిన షర్మిల .. సీఎం కేసీఆర్ పై ధ్వజం

దీక్ష కూడా చేసిన షర్మిల .. సీఎం కేసీఆర్ పై ధ్వజం


కొద్దిరోజుల క్రితం వైయస్ షర్మిల నిరుద్యోగుల కోసం కొలువు దీక్షలో భాగంగా సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఉద్యోగాల కోసం చందమామ లాంటి పిల్లలు చనిపోతున్నారని అయినప్పటికీ దున్నపోతు మీద వాన పడుతున్న చందంగా సీఎం కెసిఆర్ ప్రవర్తన ఉందని, ఆయనలో ఎలాంటి చలనం లేదని తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో ముందుండి పోరాటం చేసిన వారు విద్యార్థులని, అలాంటి వారు ఈ రోజు ఉద్యోగాలు లేక ఎన్నో కష్టాలు పడుతున్నారని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు షర్మిల. ఇటీవల వరంగల్ జిల్లాలో ఉద్యోగాల నోటిఫికేషన్లు రాలేదని తీవ్ర మనస్తాపం చెందిన సునీల్ నాయక్ అనే యువకుడు కాకతీయ యూనివర్సిటీ లో ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా నల్గొండ జిల్లాకు చెందిన శ్రీకాంత్ అనే నిరుద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

English summary
YS Sharmila, participated in the hunger strike today at Indira Park for jobs notifications again fires on CM KCR over unemployed suicides . Sharmila pleaded the eunemployed as a sister , that no one should be discouraged , that she is ready for any struggle for job notifications and the only thing is please don't commit suicide. Sharmila tweeted that change is needed today for tomorrow's future .Let's fight together for change and that they should fight till the notifications are given.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X