Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎమ్మెల్యేగా విజయమ్మ పోటీ, స్థానం ఫిక్స్ - షర్మిల షిఫ్ట్..!!

వైఎస్ విజయమ్మ మరోసారి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. అయితే, ఈ సారి ఏపీ నుంచి కాదు. తెలంగాణ అసెంబ్లీ బరిలో పోటీకి దిగేందుకు నిర్ణయం జరిగింది. కాంగ్రెస్ తో తన పార్టీ విలీనం ప్రతిపాదన కొలిక్కి రాకపోవటంతో నేరుగా తనతో పాటుగా తన తల్లి..పార్టీ అభ్యర్దులను పోటీకి దించేందుకు షర్మిల సిద్దం అయ్యారు. అందులో భాగంగా విజయమ్మకు స్థానం ఖరారు చేసారు. తొలి జాబితాను విడుదల చేసేందుకు షర్మిల కసరత్తు చేస్తున్నారు.

వైఎస్సార్టీపీ ఒంటరి పోరు:కాంగ్రెస్ లో చేరిక..పార్టీ విలీనం కోసం షర్మిల జరిపిన మంత్రాంగం ఫలితం ఇవ్వలేదు. దీంతో, సొంతంగా తెలంగాణ లో పోటీ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు పార్టీ నేతలతో ఇప్పటికే చర్చలు జరిపారు. అందులో భాగంగా తనతో పాటుగా తన తల్లిని ఎన్నికల బరిలోకి దించేందుకు నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. 15-20 మందితో తొలి జాబితా ప్రకటనకు షర్మిల సిద్దమయ్యారు. వైఎస్సార్ మరణం తరువాత విజయమ్మ పులివెందుల నుంచి ఏకగ్రీవంగా ఏపీ ఉమ్మడి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తరువాత జగన్ కొత్త పార్టీ ఏర్పాటు సమయంలో కాంగ్రెస్ కు రాజీనామా చేసి వైసీపీ నుంచి అసెంబ్లీకి ఎన్నికైన తొలి ఎమ్మెల్యేగా విజయమ్మ నిలిచారు. ఆ సమయంలో కడప నుంచి జగన్ రికార్డు స్థాయి మెజార్టీతో లోక్ సభకు ఎన్నికయ్యారు.

YS Sharmila to contest from Miryalaguda, likely to field Vijayamma form Paleir in next Elections

పాలేరు నుంచి విజయమ్మ పోటీ:2014 ఎన్నికల్లో విశాఖ నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్దిగా విజయమ్మ పోటీ చేసారు. ఆ ఎన్నికల్లొ టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా పోటీలో నిలిచాయి. ఆ ఎన్నికల్లో విశాఖ నుంచి పోటీ చేసిన కంభంపాటి హరిబాబు విశాఖ లో విజయమ్మ పైన విజయం సాధించారు. ఆ తరువాత ఎన్నికల్లో పోటీకి విజయమ్మ దూరంగా ఉన్నారు. తెలంగాణలో షర్మిల పార్టీ ఏర్పాటు తరువాత వైసీపీ గౌరవాధ్యక్షురాలి పదవికి విజయమ్మ రాజీనామా చేసారు. కుమార్తె షర్మిలతో కలిసి అప్పుడప్పుడు సభల్లో పాల్గొన్నారు. ఇక, ఇప్పుడు తెలంగాణలో ఒంటరిగానే వైఎస్సార్టీపీ విడుదలకు సిద్దం అయింది. అందులో భాగంగా తొలి నుంచి షర్మిల తాను పోటీ చేయాలని భావిస్తున్న పాలేరు సీటును తల్లి విజయమ్మకు కేటాయిస్తున్నట్లు సమాచారం. షర్మిల మిర్యాలగూడ స్థానం నుంచి పోటీకి సిద్దమని తెలుస్తోంది.

YS Sharmila to contest from Miryalaguda, likely to field Vijayamma form Paleir in next Elections

మిర్యాలగూడ నుంచి షర్మిల:అయితే, తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో షర్మిల తీసుకుంటున్న ఈ నిర్ణయం పైన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చర్చ సాగుతోంది. పాలేరు నుంచి కాంగ్రెస్ అభ్యర్దిగా మాజీ మంత్రి తుమ్మల పోటీ చేయనున్నారు. బీఆర్ఎస్ నుంచి కందాల ఉపేందర్ రెడ్డి పోటీలో ఉన్నారు.

ఈ స్థానం నుంచి ఇప్పటి విజయమ్మ పోటీ చేస్తే ఫలితం ఏంటనేది ఆసక్తి కరంగా మారుతోంది. ఇద సమయంలో సామాజిక సమీకరణాల ఆధారంగానే షర్మిల పాలేరు నుంచి మిర్యాలగూడ కు తన పోటీ స్థానం మార్చుకున్నట్లు కనిపిస్తోంది. ఇక..ఈ రెండు సీట్లతో పాటుగా మరో పది స్థానాలకు సంబంధించి షర్మిల అధికారికంగా ప్రకటన చేసేందుకు సిద్దం అవుతున్నారు. దీంతో, షర్మిల పార్టీ అభ్యర్దులు విజయావకాశాలు..ఏ పార్టీపైన ప్రభావం చూపిస్తాయనేది ఆసక్తి కరంగా మారుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+