కూతురి కోసం రంగంలో దిగిన వైఎస్ విజయమ్మ - సంచలన నిర్ణయం..!!

హైదరాబాద్: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్ పోలీసులు ఆమెను కొద్దిసేపటి కిందటే అరెస్ట్ చేశారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రగతి భవన్ వైపు దూసుకెళ్లడానికి ప్రయత్నించిన కారణంగా ఆమెను అరెస్ట్ చేసినట్లు చెబుతున్నారు. ప్రగతి భవన్‌ను ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో- పోలీసులు ఆమెను గృహ నిర్బంధంలో ఉంచారు. లోటస్ పాండ్ నివాసం వద్ద పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరింపజేశారు.

పోలీసుల కళ్లు గప్పి..

పోలీసుల కళ్లు గప్పి..

కొద్దిసేపటి కిందటే వైఎస్ షర్మిల పోలీసుల కళ్లు గప్పి లోటస్ పాండ్ నివాసం నుంచి బయటికొచ్చారు. ప్రగతి భవన్ వైపు వెళ్లే ప్రయత్నం చేశారు. మార్గమధ్యలో ఆమెను పంజాగుట్ట వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. సొంతంగా కారును డ్రైవ్ చేసుకుంటూ ప్రగతి భవన్ వైపు వెళ్లారామె. కారులో ఒంటరిగా వెళ్లిన విషయం తెలుసుకున్న వెంటనే లోటస్ పాండ్ వద్ద ఉన్న వైఎస్ఆర్టీపీ నాయకులు, కార్యకర్తలు పంజగుట్టకు చేరుకున్నారు. జై షర్మిలక్క అంటూ నినాదాలు చేశారు.

తీవ్ర ఉద్రిక్తత..

తాను రోజూ వినియోగించే కారులో కాకుండా- పార్టీ నాయకుల కారులో ఆమె లోటస్ పాండ్ నుంచి బయటికి వచ్చారు. మార్గమధ్యలో కారు మారారు. సోమవారం టీఆర్ఎస్ కార్యకర్తల దాడిలో అద్దాలు పగిలిన కారులో సొంతంగా డ్రైవ్ చేసుకుంటూ ప్రగతి భవన్‌కు వెళ్లడానికి ప్రయత్నించారు. పంజాగుట్ట జంక్షన్ వద్ద పోలీసులు ఆమెను అడ్డుకుని, అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్‌ను అడ్డుకోవడానికి వైఎస్ఆర్టీపీ నాయకులు పిట్ట రామిరెడ్డి, ఇతర కార్యకర్తలు ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది.

 కారులో ఉండగానే..

కారులో ఉండగానే..

అద్దాలు పగిలిన కారులో ప్రగతి భవన్ వైపునకు దూసుకెళ్తోన్న వైఎస్ షర్మిలను అడ్డుకున్న పోలీసులు తొలుత పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం ఎస్ఆర్ నగర్‌కు తరలించారు. పలు సెక్షన్ల కింద ఆమెపై కేసు పెట్టారు. ఆమె కారులో ఉండగానే దానికి టోయింగ్ కట్టి, లాక్కెళ్లారు. ఆ సమయంలో పిట్ట రామిరెడ్డి, ఇతర నాయకులు కారులో ఉన్నారు. పోలీసుల వైఖరికి నిరసనగా వైఎస్ఆర్టీపీ నాయకులు, కార్యకర్తలు రోడ్ల మీద బైఠాయించారు.

విజయమ్మ హౌస్ అరెస్ట్..

విజయమ్మ హౌస్ అరెస్ట్..

ఈ విషయం తెలుసుకున్న వెంటనే ఆమె తల్లి వైఎస్ విజయమ్మ రంగంలోకి దిగారు. కుమార్తెను పరామర్శించడానికి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌కు బయలుదేరి వెళ్లడానికి సిద్ధపడ్డారు. కారులో వెళ్తోన్న విజయమ్మను పోలీసులు ఇంటి వద్దే అడ్డుకున్నారు. ఎక్కడికీ వెళ్లడానికి వీల్లేదని, తమకు పైనుంచి ఆదేశాలు ఉన్నాయని స్పష్టం చేశారు. కారు దిగిన విజయమ్మ ఇంటి వద్దే బైఠాయించడానికి చేసిన ప్రయత్నాలను పోలీసులు విఫలం చేశారు.

కూతుర్ని చూడ్డానికి వెళ్లనివ్వరా..

కూతుర్ని చూడ్డానికి వెళ్లనివ్వరా..

కూతురిని చూడ్డానికి తాను వెళ్తున్నానని, తననెందుకు అడ్డుకుంటోన్నారని విజయమ్మ పోలీసులను ప్రశ్నించారు. ఇక్కడ దీక్షకు కూర్చుంటానని, ధర్నా చేస్తానని చెప్పారు. తానేమీ ఆందోళన చెయ్యడానికి వెళ్లట్లేదని, కావాలంటే తనతో పాటు రావాలని విజ్ఞప్తి చేశారు. తనను వెళ్లనివ్వకపోతే ఆందోళన చేస్తామని అన్నారు.

ఆమరణ నిరాహార దీక్ష..

ఆమరణ నిరాహార దీక్ష..

పోలీసులు ఎంతకూ వెళ్లనివ్వకపోవడంతో నిరసన వ్యక్తం చేశారు విజయమ్మ. ఇంటి వద్దే ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటున్నానని చెప్పారు. పార్టీ కార్యకర్తలందరినీ పిలవమంటారా? మైక్ తీసుకుని మాట్లాడమంటారా? అంటూ నిలదీశారు. రాష్ట్రమంతా బంద్‌లు, గొడవలు చేయమంటారా? అని హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+