షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర.. మార్చి 1 నుంచి పునఃప్రారంభం
తెలంగాణలో తమ సత్తా చాటేందుకు వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వచ్చే 2023 సార్వత్రిక ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఉద్యోగాల భర్తీ కోసం నిరుద్యోగ దీక్ష పేరుతో పోరాటం చేస్తూ యువతకు మరింత దగ్గర అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు షర్మిల చేవెళ్ల నుంచి పాదయాత్ర ప్రారంభించారు. ఆరు పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని సుమారు 150 గ్రామాల్లో పాదయాత్ర కొనసాగించారు.
Recommended Video

ఎన్నికల కోడ్, కరోనాతో పాదయాత్రకు బ్రేక్
అయితే తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌తోపాటు కరోనా విజృంభణతో గత నవంబర్ 11న షర్మిల పాదయాత్రకు బ్రేక్ పడింది. ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం కొండపాక గూడెం నుంచే తన పాదయాత్రను ప్రారంభిస్తారని వైఎస్ షర్మిల గతంలోనే చెప్పారు. తొలి విడతలో మొత్తం 21 రోజుల పాటు పాదయాత్ర సాగింది. ఎన్నికలు కోడ్ అయిపోయిన తర్వాత పాదయాత్రను ప్రారంభించేందుకు సిద్ధంగా కాగా.. రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభించింది. దీంతో మరోసారి తన యాత్రను షర్మిల వాయిదా వేశారు

2 మార్చి 1 నుంచి పాదయాత్ర
తెలంగాణలో ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టింది. సభలు , సమావేశాలపై ఉన్న ఆంక్షలను ప్రభుత్వం సడలించింది. దీంతో మళ్లీ తన ప్రజా ప్రస్థానం పాదయాత్రను ప్రారంభించేందుకు వైఎస్ షర్మిల సిద్ధమయ్యారు. మార్చి 1 నుంచి పాదయాత్రను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నల్లగొండ జిల్లా కొండపాక గూడెం నుంచి పాదయాత్రను మొదలు పెట్టాలని షర్మిల నిర్ణయించారు. వచ్చే ఎన్నికల నాటికి 4వేల కిలోమీటర్ల మేర యాత్ర చేయాలని గతంలోనే షర్మిల నిర్ణయించారు.

రాజన్న రాజ్యం తెస్తా..
తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తామన్నారు షర్మిల. కేసీఆర్ పాలనలో సామాన్యులు బతికే పరిస్థితి లేదని ఆరోపణలు గుప్పించారు. రైతుల అప్పులు పాలవుతున్నా పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. ప్రజలను మోసం చేయడంలో కేసీఆర్‌కు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. బీజేపీ, కాంగ్రెస్‌తో రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లేదని ఆరోపించారు. దొరగారి పాలనకు గడియలు దగ్గరపడ్డాయని మండిపడ్డారు.

పాదయాత్రపై పీకే టీమ్ అధ్యయనం
అటు వైఎస్ఆర్టీపీని రాజకీయ వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిషోర్‌కు చెందిన టీమ్.. షర్మిల పాదయాత్రపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తోంది. ఏయే అంశాలపై టీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెట్టాలి. వైఎస్సార్ టీపిని జనంలోకి మరింత బలంగా ఏలా తీసుకెళ్లాలన్న దానిపై కసరత్తు చేస్తోంది. అదే విధంగా నిరుద్యోగ సమస్య, పంటలకు గిట్టుబాటు ధరల కల్పనపై మరింత దూకుడుగా వ్వవహరించాలని షర్మిల నిర్ణయించినట్లు తెలుస్తోంది












Click it and Unblock the Notifications