Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

గద్దర్ అంత్యక్రియల్లో తొక్కిసలాట: సియాసత్ పత్రిక మేనేజింగ్ ఎడిటర్ కన్నుమూత

హైదరాబాద్: ప్రజా గాయకుడు గద్దర్ అంత్యక్రియల్లో విషాదం చోటు చేసుకుంది. అంతిమయాత్రలో జరిగిన తొక్కిసలాటలో సియాసత్ ఉర్దూ పత్రిక మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీ ఖాన్ (62) కన్నుమూశారు. తొక్కిసలాటలో అస్వస్థతకు గురైన జహీరుద్దీన్‌కు గుండెపోటు రావడంతో.. వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించారు.

అయితే, మార్గమధ్యలోనే అలీఖాన్ తుది శ్వాస విడిచారు. కాగా, సోమవారం రాత్రి అల్వాల్‌లోని మహాబోధి స్కూల్‌లో అంత్యక్రియలు జరిగాయి. గద్దర్ ఇంటి నుంచి ఆయన పార్థీవదేహాన్ని స్కూల్‌కు తీసుకొచ్చారు. ఈ అంతిమయాత్రలో వేలాది మంది అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట చోటు చేసుకుంది. వేలాది మంది తోసుకుంటూ రావడంతో అక్కడేవున్న అలీఖాన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయారు. అంతకుముందు తోపులాటను అదుపు చేసేందుకు పోలీసులు స్వల్ప లాఠీ ఛార్జీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Zaheeruddin Ali Khan of The Siasat Daily Managing editor passed away due to stampede in Gaddars funeral

గద్దర్‌కు కన్నీటి వీడ్కోలు

ప్రజా గాయకుడు, ప్రజా యుద్ధనౌక గద్దర్ అంత్యక్రియలు సోమవారం రాత్రి ముగిశాయి. వేలాది మంది అభిమానుల మధ్య అల్వాల్‌లోని మహాబోధి విద్యాలయ ఆవరణలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో.. బౌద్ధ సంప్రదాయం ప్రకారం అంతిమ సంస్కారాలను పూర్తి చేశారు. తరలివచ్చని అశేష అభిమానులు ఉద్యమవీరుడికి విప్లవ జోహార్లు సమర్పించారు.

అంతకుముందు కడసారిగా గద్దర్‌ను చూసేందుకు ఎల్బీ స్టేడియానికి సినీ, రాజకీయ ప్రముఖులు, కళాకారులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి నివాళులర్పించారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు ఎల్బీ స్టేడియం నుంచి గన్‌పార్క్, అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్తూపం, ట్యాంక్‌బండ్ మీదుగా అల్వాల్ వరకు గద్దర్ అంతిమ యాత్ర కొనసాగింది. అల్వాల్‌లోని నివాసంలో గద్దర్ పార్థీవదేహాన్ని కొంత సమయం ఉంచారు.

సీఎం కేసీఆర్ నివాళి..

ప్ర‌జా గాయ‌కుడు గ‌ద్ద‌ర్ పార్థివ‌దేహానికి తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ నివాళుల‌ర్పించారు. అల్వాల్‌లోని గ‌ద్ద‌ర్ నివాసానికి సోమ‌వారం సాయంత్రం కేసీఆర్ చేరుకున్నారు. అనంత‌రం గ‌ద్ద‌ర్ భౌతిక‌కాయానికి నివాళుల‌ర్పించి సీఎం కేసీఆర్.. ఆయ‌న కుటుంబ స‌భ్యులను ఓదార్చారు. గద్దర్ ఆత్మకు శాంతిచేకూరాలని శ్రద్ధాంజలి ఘటించారు.

ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమ సమయంలో గద్దర్ తో తనుకున్న అనుబంధాన్ని స్మరించుకున్న సీఎం కేసీఆర్. సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు హ‌రీశ్‌రావు, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్, వేముల ప్ర‌శాంత్ రెడ్డి, ప్ర‌ణాళిక సంఘం ఉపాధ్య‌క్షుడు వినోద్ కుమార్, ఎమ్మెల్యేలు బాల్క సుమ‌న్, ర‌స‌మ‌యి బాల‌కిష‌న్, చంటి క్రాంతి కిర‌ణ్‌, మైనంప‌ల్లి హ‌న్మంత్ రావు, ఎమ్మెల్సీ గోరెటి వెంక‌న్న‌, బీఆర్ఎస్ నాయ‌కులు మోత్కుప‌ల్లి న‌ర్సింహులు నివాళుల‌ర్పించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+