వరల్డ్ కప్ లో ఇండియా మ్యాచ్ లు నేరుగా చూడాలంటే..!!

మరి కొద్ది రోజుల్లో క్రికెట్ పండుగ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి స్వల్ప మార్పులతో ఐసీసీ తాజాగా షెడ్యూల్ విడుదల చేసింది. టీమిండియా ఆడే మ్యాచ్ లను ప్రత్యక్షంగా వీక్షించేందుకు టికెట్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. టికెట్ల అమ్మకాల తేదీలు..వివరాలను ఐసీసీ ప్రకటించింది. ఈ నెల 25వ తేదీ నుంచి మ్యాచ్ లు జరిగే తేదీల ఆధారంగా టికెట్లను ఆన్ లైన్ లో విడుల చేయనున్నారు. ఇండియా, పాక్ మధ్య అక్టోబర్ 14న జరిగే మ్యాచ్ కు భారీ డిమాండ్ అంచనా వేస్తున్నారు.

అభిమానుల కోసం:ఇండియాలో క్రికెట్ ఫీవర్ క్రమేణా పెరుగుతోంది. అభిమానుల అంచనాలకు అనుగుణంగా ప్రత్యక్షంగా మ్యాచ్ లు చూసేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేసారు. భారీ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని వరల్డ్‌ కప్ లో ఆతిథ్య భారత జట్టు ఆడే మ్యాచ్‌ల టిక్కెట్లను దశల వారీగా విక్రయించనున్నారు. ఆస్ట్రేలియా (అక్టోబరు 8న), అఫ్ఘానిస్థాన్‌ (అక్టోబరు 11న), బంగ్లాదేశ్‌ (అక్టోబరు 19న) జట్లతో జరిగే మ్యాచ్‌ల టిక్కెట్ల బుకింగ్స్‌ ఈ నెల 31న ఓపెన్‌ కానున్నాయి. అలాగే న్యూజిలాండ్‌ (అక్టోబరు 22న), ఇంగ్లండ్‌ (అక్టోబరు 29న),శ్రీలంక (నవంబరు 2న) జట్లతో టీమిండియా తలపడే మ్యాచ్‌ల టిక్కెట్లను వచ్చే నెల ఒకటినుంచి అందుబాటులో ఉంచనున్నారు.

The ICC Mens Cricket World Cup 2023 tickets will be available for sale, see details

భారత్ ఆడే మ్యాచ్ లకోసం:దక్షిణాఫ్రికా (నవంబరు 5న), నెదర్లాండ్స్‌ (నవంబరు 12న)లతో జరిగే మ్యాచ్‌ల టిక్కెట్లను వచ్చే నెల రెండు నుంచి విక్రయించనున్నారు. ఇక చిరకాల ప్రత్యర్థులు భారత్‌-పాకిస్థాన్‌ జట్లు అక్టోబరు 14న అహ్మదాబాద్‌ వేదికగా తలపడే మ్యాచ్‌ టికెట్లను వచ్చే నెల 3 నుంచి అమ్మకానికి ఉంచనున్నారు. సెమీస్‌, ఫైనల్‌ మ్యాచ్‌ టిక్కెట్లను వచ్చే నెల 15 నుంచి విక్రయిస్తారు. బుక్‌మైషో వెబ్‌సైట్‌లో టిక్కెట్లను అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించారు. భారత ఆడే మ్యాచ్‌లు అలాగే సెమీ-ఫైనల్ మరియు టోర్నమెంట్ ఫైనల్ టిక్కెట్‌లను కొనుగోలు చేయడానికి ప్రత్యేక షెడ్యూల్‌ను విడుదల చేసింది.

టికెట్ అమ్మకాలు ఇలా:అభిమానులు ఆగస్టు 15 నుండి టిక్కెట్ల కొనుగోలు కోసం నమోదు చేసుకోవచ్చని పేర్కొంది. అయితే, టిక్కెట్ల అమ్మకాలు ఆగష్టు 25 నుండి ప్రారంభమవుతాయి. ప్రపంచ కప్ 2023 యొక్క ఫైనల్ మరియు సెమీ-ఫైనల్ టిక్కెట్లు సెప్టెంబర్ 15 నుండి ప్రారంభమవుతాయని ఐసీసీ వెల్లడించింది. క్రికెట్ సమరానికి ముందే టికెట్ల అమ్మకాల ద్వారా చివరి నిమిషంలో రద్దీ తగ్గించాలని ఐసీసీ భావిస్తోంది. దాయాదుల సమయం కోసం భారీగా ప్రేక్షకులు తరలి వచ్చే అవకాశం ఉందని అంచనాలు వ్యక్తం అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+