తిరుమలలో కృతి సనన్ కు ముద్దు పెట్టిన ఆదిపురుష్ డైరెక్టర్.. వెల్లువగా విమర్శలు!!

ఆది పురుష్ డైరెక్టర్ ఓం రౌత్, హీరోయిన్ కృతి సనన్ తో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు ఓం రౌత్ చేసిన పని ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ప్రభాస్, కృతిసనన్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ఆది పురుష్ . ఆది పురుష్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న తిరుపతిలో చాలా ఘనంగా నిర్వహించారు.

ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని ఆది పురుష్ చిత్రబృందం దర్శించుకున్నారు. అనంతరం గుడి వెలుపల కృతి సనన్ కు సెండ్ ఆఫ్ ఇస్తూ ఓం రౌత్ చేసిన పని పలు విమర్శలకు కారణమవుతోంది. శ్రీవారి ఆలయ పరిసరాల్లో ఉన్న సమయంలోనే ఓం రౌత్ కృతి సనన్ కు హగ్ ఇచ్చి ముద్దు పెట్టు కున్నారు. దీంతో దేవుడి సన్నిధిలో ముద్దులు పెట్టడమేమిటని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Adipurush Director Om Raut kissed Kriti Sanan in Tirumala; criticism on controversy

దీనిపై బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డి స్పందించారు. తిరుమల ఒక ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం అని, ఇది పిక్నిక్ స్పాట్ లేదా షూటింగ్ స్పాట్ కాదని ఆయన పేర్కొన్నారు. తిరుమల శ్రీవారి అర్చన సేవలో పాల్గొని ఆలయం నుండి బయటకు వచ్చిన తర్వాత ఆలయ మహాద్వారం ముందు డైరెక్టర్ ఓం రౌత్ చేసిన పనిని తాము ఖండిస్తున్నామని తెలిపారు.

పరమ పవిత్రమైన శ్రీవారి ఆలయం ముందు ఆది పురుష్ డైరెక్టర్ చేసిన పనికి తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సినిమా కల్చర్, నార్త్ కల్చర్ ఏదైనా సరే ఇంట్లోనో లేదా మారిషస్ లోనో చేసుకోవాలని శ్రీవారి ఆలయం ముందు కాదని, భగవంతుడి సన్నిధిలో ఇటువంటివి చేయటం సరికాదని ఆయన పేర్కొన్నారు.

అయితే ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం కృతి సనన్ కు ఫ్లైట్ టైం అవుతున్న కారణంగా ఆమె హడావుడిగా వెళ్లడానికి సిద్ధమవుతున్న సమయంలో దర్శకుడు ఆమెకు సెండ్ ఆఫ్ ఇవ్వడంలో భాగంగానే ఇలా చేశారని చెబుతున్నారు. ఇందులో ఎలాంటి అసభ్యత లేదని కూడా పలువురు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+