Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Chandrayaan 3: చందమామపై శాశ్వత ముద్ర- రోవర్ వీల్‌పై మూడు సింహాల లోగో

తిరుపతి: భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం ఇస్రో.. మరో ఘనతను సాధించింది. చంద్రయాన్ 3 రాకెట్‌ను నింగిలోకి పంపించింది. తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలో గల సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధన సంస్థ నుంచి నిప్పులు చిమ్ముకుంటూ నింగివైపు దూసుకెళ్లింది ఈ రాకెట్. 2019లో చేపట్టిన చంద్రయాన్ 2 ప్రయోగం విఫలమైన నేపథ్యంలో- ఈ మూన్ మిషన్‌ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది ఇస్రో.

లాంచ్ ప్యాడ్ నుంచి దూసుకెళ్లిన కొద్దిసేపటికే ఈ ప్రయోగం విజయవంతమైంది. రాకెట్ నుంచి చంద్రయాన్ 3 శాటిలైట్ విడిపోయింది. చంద్రయాన్-3లో ల్యాండర్, రోవర్, ప్రొపల్షన్ మాడ్యూల్ ఉన్నాయి. దీని బరువు దాదాపు 3,900 కేజీలు. చంద్రుడి కక్ష్య నుంచి భూమి స్పెక్ట్రల్- పోలారిమెట్రిక్ కొలతలను అధ్యయనం చేయడానికి స్పెక్ట్రో-పోలరిమెట్రీ ఆఫ్ హాబిటబుల్ ప్లానెట్ ఎర్త్ (షేప్) పేలోడ్‌ను ఈ రాకెట్‌తో పాటు పంపించారు.

Chandrayaan 3: ISRO logo can be seen empossed on the last wheel of Pragyan Rover

చంద్రయాన్ 3 మిషన్.. ల్యాండింగ్ తేదీ వెలువడింది. ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్.. ఈ విషయాన్ని ప్రకటించారు. ఆగస్టు 23వ తేదీన సరిగ్గా సాయంత్రం 5 గంటల 47 నిమిషాలకు చంద్రయాన్ 3 జాబిల్లి మీద అడుగుపెడుతుంది. దీనికోసం చంద్రుడి దక్షిణ ధృవాన్ని ఎంచుకున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్ 3 ఉపగ్రహం 42 రోజుల పాటు అంతరిక్ష ప్రయాణం సాగిస్తుంది.

ప్రస్తుతం భూకక్ష్యలో ప్రరిభ్రమిస్తోన్న ఈ శాటిలైట్.. క్రమంగా చందమామ ఆర్బిట్‌లోకి ప్రవేశిస్తుంది. అనుకున్నది అనుకున్నట్లుగా.. అన్నీ సవ్యంగా సాగితే- ఆగస్టు 23వ తేదీన సాయంత్రం 5:47 నిమిషాలకు చంద్రుడి దక్షిణ ధృవంపై చంద్రయాన్ 3 ల్యాండర్.. దిగుతుంది. ఆ వెంటనే రోవర్- జాబిల్లి ఉపరితలంపై కాలు మోపుతుందని సోమనాథ్ తెలిపారు.

కాగా- చందమామ ఉపరితలంపై శాశ్వత ముద్ర వేయబోతోంది భారత్. చంద్రయాన్ 3 శాటిలైట్‌ మోసుకెళ్లిన ప్రజ్ఞాన్ రోవర్‌ వీల్‌పై మూడు సింహాలు, ఇస్రో లోగోను ముద్రించడమే దీనికి కారణం. జాబిల్లిపై దిగిన తరువాత అది సంచరిస్తున్నప్పుడు మూడు సింహాలు, ఇస్రో లోగో జాడలు అక్కడి మట్టిపై పడతాయి. అవి శాశ్వతంగా నిలిచిపోతాయి.

ఆ ఉద్దేశంతోనే రోవర్‌లోని చివరి రెండు వీల్స్‌‌లల్లో ఒకదానిపై మూడు సింహాలు, మరో దానిపై ఇస్రో లోగోను ముద్రించినట్లు తెలుస్తోంది. 2019లో ప్రయోగించిన చంద్రయాన్ 2లో వినియోగించిన రోవర్ వీల్స్ పైనా అవే లోగోలను ముద్రించినప్పటికీ.. అది సాధ్యపడలేదు. ఆ ప్రయోగం విఫలమైంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+