Tirumala: తిరుమలో భారీగా భక్తుల రద్దీ.. స్వామివారి దర్శనానికి 24 గంటల సమయం..
కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు భారీగా తరలొచ్చారు. భక్తులతో కంపార్టు మెంట్లు నిండిపోయాయి. శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు 31 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లు అన్నీ నిండిపోయి క్యూ లైన్లు వెలుపలికి వచ్చాయి. స్వామివారి సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు.
కంపార్ట్‌మెంట్లన్నీ నిండి కృష్ణతేజ గెస్ట్‌హౌజ్ వరకు భక్తులు క్యూలో నిల్చున్నారు. శ్రీవారిని శనివారం 87,762 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో 43,753 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్ని శ్రీవారి హుండీ రూ.3.61 కోట్లు వచ్చిన టీటీడీ అధికారులు తెలిపారు. భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. భక్తులకు అన్నప్రసాదాలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. భక్తులందరూ టీటీడీకి సహకరించాలని కోరారు.

మరోవైపు తిరుమల కొండపై గదులకు కూడా డిమాండా భారీగా పెరిగింది. దాదాపు అన్ని గదులు నిండిపోయాయి. జూన్ 21న ఆస్థానమండపంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించనున్నారు. ఆస్థానమండపంలో ఉదయం 6 నుంచి 8 గంటల వరకు యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు టీటీడీ అధికారులు చెప్పారు. ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ ఆధ్వర్యంలో యోగా శిక్షకులు ఇందులో యోగాసనాలు, వాటి వల్ల శారీరకంగా, మానసికంగా కలిగే ఉపయోగాలను వివరిస్తారని తెలిపారు.
తిరుమల శ్రీవారి అర్జిత సేవల టికెట్లు 19 నాడు విడుదల కానున్నాయి. అధికమాసం కారణంగా ఈ ఏడాది తిరుమల శ్రీవారికి రెండు బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తామని టీటీడీ తెలిపింది.సెప్టెంబరు 18 నుంచి 26వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబరు 15 నుంచి 23వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేయనున్నారు. సోమవారం జరిగే టీటీడీ బోర్డు సమావేశంలో బ్రహ్మోత్సవాల నిర్వహణ పైన చర్చించనున్నారు.












Click it and Unblock the Notifications