తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Gokulashtami: తిరుమల, తిరుపతిలో గోకులాష్టామి, కరోనాతో బ్రేక్, తిరుమాడ వీధుల్లో శ్రీకృష్ణుడు !

|
Google Oneindia TeluguNews

తిరుమల/ తిరుపతి: తిరుమ‌ల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని సాక్షాత్తు ద్వాపరయుగపురుషుడైన శ్రీకృష్ణునిగా స్మరించుకుని ఆగస్టు 30వ తేదీన శ్రీకృష్ణజన్మాష్టమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో గోకులాష్టమి ఆస్థానం నిర్వహించనున్నారు.

శ్రీవారి ఆలయంలో రాత్రి 7 నుండి 8 గంటల వరకు గోకులాష్టమి ఆస్థానం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా సర్వభూపాల వాహనంపై శ్రీకృష్ణస్వామివారిని వేంచేపు చేసి నివేదనలు సమర్పిస్తారు. శ్రీ ఉగ్రశ్రీనివాసమూర్తికి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు, శ్రీకృష్ణస్వామివారికి ఏకాంత తిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం ద్వాదశారాధనం చేపడతారు.

Tirupati: తిరుమలలో సాంప్రదాయ భోజనాలు, భక్తుల ఆరోగ్యం ముఖ్యం, అన్నమయ్య క్యాంటీన్ లో !Tirupati: తిరుమలలో సాంప్రదాయ భోజనాలు, భక్తుల ఆరోగ్యం ముఖ్యం, అన్నమయ్య క్యాంటీన్ లో !

 తిరుమలలో శ్రీకృష్ణజన్మాష్టమి

తిరుమలలో శ్రీకృష్ణజన్మాష్టమి

తిరుమ‌ల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని సాక్షాత్తు ద్వాపరయుగపురుషుడైన శ్రీకృష్ణునిగా స్మరించుకుని ఆగస్టు 30వ తేదీన శ్రీకృష్ణజన్మాష్టమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో గోకులాష్టమి ఆస్థానం నిర్వహించనున్నారు.శ్రీవారి ఆలయంలో రాత్రి 7 నుండి 8 గంటల వరకు గోకులాష్టమి ఆస్థానం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా సర్వభూపాల వాహనంపై శ్రీకృష్ణస్వామివారిని వేంచేపు చేసి నివేదనలు సమర్పిస్తారు. శ్రీ ఉగ్రశ్రీనివాసమూర్తికి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు, శ్రీకృష్ణస్వామివారికి ఏకాంత తిరుమంజనం నిర్వహిస్తారు.

తిరుమాడ వీధులలో శ్రీకృష్ణుడు

తిరుమాడ వీధులలో శ్రీకృష్ణుడు

ఆగస్టు 31న తిరుమలలో ఉట్లోత్సవాన్ని పుర‌స్క‌రించ‌కుని సాయంత్రం 4 నుండి 5 గంటల వర‌కు శ్రీమలయప్పస్వామివారు బంగారు తిరుచ్చిపై, శ్రీకృష్ణస్వామివారు మరో తిరుచ్చిపై ఆల‌యంలోని రంగ‌నాయ‌కుల మండ‌పానికి వేంచేపు చేసి ఆస్థానం నిర్వ‌హిస్తారు. కాగా, ప్ర‌తి ఏడాది తిరుమ‌లలో ఈ ఉట్లోత్సవాన్ని తిలకించడానికి శ్రీ మలయప్పస్వామివారు, శ్రీకృష్ణస్వామివారు తిరుచ్చిపై తిరుమాడ వీధులలో విహరిస్తూ హార‌తులు స్వీక‌రిస్తారు.

 కరోనా దెబ్బతో రద్దు చేసిన టీటీడీ

కరోనా దెబ్బతో రద్దు చేసిన టీటీడీ

యువకులు కూడా ఎంతో ఉత్సాహంతో ఈ ఉట్లోత్సవంలో పాల్గొంటారు. కానీ కోవిడ్ - 19 నిబంధ‌న‌ల మేర‌కు తిరుమలలో శ్రీకృష్ణ జన్మాష్టమి, ఉట్లోత్సవాల‌ను శ్రీ‌వారి ఆల‌యంలో ఈ ఏడాది ఏకాంతంగా టీటీడీ నిర్వ‌హించనుంది.

ఉట్లోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 31న శ్రీవారి ఆలయంలో నిర్వహించే వ‌ర్చువ‌ల్ సేవ‌లైన ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.

 గోశాలలో గోకులాష్టమి వేడుకలు

గోశాలలో గోకులాష్టమి వేడుకలు

తిరుపతి శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో ఆగ‌స్టు 30న సోమవారం టీటీడీ ఆధ్వర్యంలో గోకులాష్టమి గోపూజ ఉత్సవం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. కోవిడ్ -19 వ్యాప్తి నేప‌థ్యంలో నిబంధ‌న‌లు పాటిస్తూ ఈ కార్య‌క్రమం నిర్వహిస్తారు.

వేణుగోపాలస్వామి సన్నిధిలో !

వేణుగోపాలస్వామి సన్నిధిలో !

ఇందులో భాగంగా ఉదయం 10.30 గంటలకు 'గోపూజ మహోత్సవం' జరుగనుంది. ఆ తరువాత శ్రీవేణుగోపాలస్వామివారి సన్నిధిలో పూజ, హారతి ఇస్తారు.భారతీయ సంస్కృతిలో గోవుకు ప్రముఖ స్థానం ఉంది. గోవును హిందువులు గోమాతగా పూజిస్తారు. గోపూజ‌ వల్ల పాడిపంటలు వృద్ధి చెంది దేశం సస్యశ్యామలం అవుతుందని భ‌క్తుల నమ్మకం. ఈ సంద‌ర్భంగా గోవుల‌ను ప్ర‌త్యేకంగా అలంక‌రించి అర్చ‌కులు పూజా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు. కరోనా మహమ్మారి కారణంగా ఈ సంవత్సరం తిరుమలలో గోకులాష్టామికి హాజరుకావడానికి భక్తులకు అనుమతి ఇవ్వడం లేదు. తిరుమలతో పాటు తిరుపతిలో కూడా గోకులాష్టామి వేడుకలకు ప్రజలు దూరం కానున్నారు. ముఖ్యంగా తిరుమలలో గోకులాష్టామి వేడుకలకు ప్రతి సంవత్సరం యువకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యేవారు. అయితే ఈ సంవత్సరం కోవిడ్ కారణంగా యువకులకు ఆచాన్స్ మిస్ అయ్యింది.

English summary
Gokulashtami: Gokulashtami Celebration in Tirumala and Tirupati in Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X