తీరం దాటిన తుపాన్.. తిరుమల కొండపై వర్ష బీభత్సం, పాపవినాశనం రోడ్ మూసివేత
తుపాన్ తీరం దాటింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ను వణికిస్తోన్న తుపాన్ చెన్నై - శ్రీహరి కోట మధ్య తీరం దాటింది. మరో 24 గంటల పాటు ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయనివాతావరణ శాఖ తెలిపింది. దీంతో అధికారులు మరింత అప్రమత్తం అయ్యారు. భారీ వర్షాలు తిరుమల కొండపై కూడా పడుతున్నాయి. తీవ్రంగా గాలుల వీస్తుండటంతో భారీ వృక్షాలు కూలిపోయాయి. రోడ్లకు అడ్డంగా భారీ వృక్షాలు కూలిపోవటంతో తిరుమల అధికారులు రంగంలోకి దిగారు.
వృక్షాలను నరికి కొమ్మలను తొలగిస్తున్నారు. ఇదిలా ఉంటే తిరుమలలో భారీగా కురుస్తున్న వర్షాలకు ముందస్తుగా అధికారులు తిరుమల నుంచి పాపవినాశనం వెళ్లే రోడ్డును అధికారులు మూసివేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు జిల్లాలోని తిరుమల భారీ వర్షాలతో తడిసిముద్దవుతోంది. తీవ్ర గాలుల ధాటికి కొండపై పలు ప్రాంతాల్లో భారీ వృక్షాలు కుప్పకూలిపోయాయి. చెట్ల కొమ్మలు విరిగి రోడ్లపై పడ్డాయి.

వాతావరణ పరిస్థితుల్లో తిరుమల-పాపవినాశనం రోడ్డును అధికారులు మూసేశారు. రోడ్లపై పడిన వృక్షాలు, కొమ్మలను అటవీ, టీటీడీ అధికారులు తొలగిస్తున్నారు. మరోవైపు ఘాట్ రోడ్లలో కొండ చరియలు విరిగిపడే ప్రమాదం ఉండటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. వెంటనే తగిన భద్రతా చర్యలను చేపట్టారు. ఘాట్ రోడ్డులో ప్రయాణించే వాహనదారులు అలర్ట్‌గా ఉండాలని హెచ్చరించారు. రెప్పపాటులో ఏమైనా జరగొచ్చని.. వీలయితే అటు వెళ్లొద్దని సూచించారు.
పంట చేతికి వచ్చే సమయంలో కురుస్తోన్న వర్షాలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే వరి పంట చేతికి వచ్చింది. వర్షాలు పడటంతో.. నీటితో తడిగా ఉంటుంది. దీంతో మిషన్ల ద్వారా కోత మరింత కష్టం అవుతుంది. వరుణ దేవ తమను కరుణించు అని అన్నదాతలు వేడుకుంటున్నారు. కానీ తుపానులు, అల్పపీడనలు ఏర్పడుతున్నాయి. దీంతో రైతన్న బిక్కు బిక్కుమంటున్నాడు.












Click it and Unblock the Notifications