తిరుమల నడకదారిలో చిరుత, ఎలుగుబంటి: భక్తులకు అలర్ట్

తిరుపతి: తిరుమల అలిపిరి నడక మార్గంలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో శ్రీలక్ష్మీనారాయణ స్వామి ఆలయం నుంచి రిపీటర్ మధ్య ప్రాంతంలో చిరుత, ఎలుగుబంటి సంచరిస్తున్న దృశ్యాలు ట్రాప్ కెమెరాలో రికార్డయ్యాయి. దీంతో నకడదారి భక్తులను తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అప్రమత్తం చేసింది.

భక్తులు జాగ్రత్తగా ఉండాలని, గుంపులు గుంపులుగా వెళ్లాలని సూచించింది. మరోవైపు, చిరుత, ఎలుగుబంటిని బంధించేందుకు టీటీడీ, అటవీశాఖ అధికారులు చర్యలు చేపట్టారు.

 leopard and bear in tirumala walkway: TTD alerts devotees.

పాక్షిక చంద్రగ్రహణం: 8 గంట‌ల పాటు శ్రీ‌వారి ఆల‌య త‌లుపులు మూత‌

అక్టోబర్‌ 29వ తేదీన పాక్షిక చంద్రగ్రహణం కారణంగా అక్టోబర్‌ 28న రాత్రి 7.05 గంటలకు శ్రీవారి ఆలయ తలుపులు మూసివేసి అక్టోబరు 29వ తేదీ తెల్లవారుజామున 3.15 గంటలకు తెరుస్తారు. దాదాపు ఎనిమిది గంటల పాటు ఆలయ తలుపులు మూసి ఉంటాయి.అక్టోబర్‌ 29వ తేదీ తెల్లవారుజామున 1.05 నుండి 2.22 గంటల మధ్య పాక్షిక చంద్రగ్రహణం పూర్తవుతుంది.

ఈ కారణంగా తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనాన్ని అక్టోబరు 28న సాయంత్రం 6 గంటలకు మూసివేసి అక్టోబరు 29న ఉదయం 9 గంటలకు తెరుస్తారు. ఈ సమయంలో అన్నప్రసాదాల పంపిణీ ఉండదు. అదేవిధంగా, అక్టోబర్‌ 28న సహస్రదీపాలంకారసేవను, వికలాంగులు, వయోవృద్ధుల దర్శనాన్ని టీటీడీ రద్దు చేసింది. భ‌క్తులు ఈ విష‌యాల‌ను గ‌మ‌నించి అసౌక‌ర్యానికి గురికాకుండా తిరుమ‌ల యాత్ర‌కు ప్ర‌ణాళిక రూపొందించుకోవాల‌ని కోర‌డ‌మైన‌ది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+