Tirumala: సర్వభూపాల వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన శ్రీవారు..

తిరుమలలో జరుగుతున్న నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన బుధవారం సాయంత్రం శ్రీవారు గజేంద్ర మోక్ష అలంకారంలో సర్వభూపాల వాహనంపై నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉభయ తిరుమల పీఠాధిపతులు, టీటీడీ చైర్మన్ శ్రీ బీ కరుణాకరరెడ్డి, ఈవో శ్రీ ఏవీ ధర్మారెడ్డితో పాటు భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. బుధ‌వారం ఉదయం శ్రీ మలయప్పస్వామి కల్పవృక్ష వాహనంపై రాజమన్నార్ అలంకారంలో దర్శనమిచ్చారు.

వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల గోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. క్షీరసాగరమథనంలో విలువైన వస్తువులెన్నో ఉద్భవించాయని... వాటిలో క‌ల్ప‌వృక్షం ఒకటి పురోహితలు చెప్పారు. ఈ చెట్టు నీడన చేరిన వారికి ఆకలిదప్పులుండవని పూర్వజన్మస్మరణ కూడా కలుగుతుందన వారు చెప్పారు.

On the fourth day Tirumala Venkateswara visited the devotees on the vehicle of Sarvabhupala

ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి. అలాకాక క‌ల్ప‌వృక్షం కోరుకున్న‌ ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుందని వివరించారు. అటువంటి క‌ల్ప‌వృక్ష‌ వాహనాన్ని అధిరోహించి నాలుగో రోజు ఉదయం తిరుమాడ వీధులలో భక్తులకు తనివితీరా దర్శనమిచ్చాడు శ్రీనివాసుడు.వాహ‌న‌సేవ‌లో తిరుమ‌ల శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, తిరుమ‌ల శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, టీటీడీ ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, ప‌లువురు బోర్డు స‌భ్యులు, జేఈవో శ్రీమతి సదా భార్గవి, సివిఎస్వో శ్రీ న‌ర‌సింహ కిషోర్‌ ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన మంగ‌ళ‌వారం రాత్రి 7 గంట‌లకు శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మలయప్పస్వామివారు బ‌కాసుర‌వ‌ధ‌ అలంకారంలో ముత్య‌పుపందిరి వాహనంపై భ‌క్తుల‌ను క‌టాక్షించారు. ముత్యాలు నిర్మలకాంతులు వ్యాపించడానికి, ఆ కాంతులు దర్శించి భక్తులు ముక్తులు కావడానికి రాత్రి వేళ అనుకూలం. ముత్యం స్వచ్ఛతకు సంకేతం. మనిషి శరీరాన్ని ఆధ్యాత్మిక సంపదతో శుద్ధి చేసుకుంటే బుద్ధి ముత్యంలాగా మారి, జనన, మరణచక్రం నుండి విడుదలై మోక్షాన్ని పొందుతుందని ప్రసిస్తి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+