చంద్రబాబు సర్కస్ లో కోతి: బీజేపీ, కాంగ్రెస్ మధ్య చక్కర్లు: టీటీడీ నిధులను అడ్డంగా వాడేస్తున్నారు!

Recommended Video

    AP Election 2019 : Subramanian Swamy Says Chandrababu Naidu Behaves Like Monkey In Circus | Oneindia

    అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సర్కస్ రింగ్ లో కోతి లాంటి వారు. సర్కస్ లో కోతి అటూ, ఇటూ తిరుగుతూ ఉంటుంది. ప్రేక్షకులను నవ్విస్తూ ఉంటుంది. ప్రస్తుతం చంద్రబాబు పరిస్థితి కూడా అంతే. రాష్ట్ర సంక్షేమం పేరును అడ్డు పెట్టుకుని కూటముల మధ్య అటూ, ఇటూ తిరుగుతూ ఉంటారు. 2014 ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. 2019 ఎన్నికల నాటికి కాంగ్రెస్ కూటమిలో చేరిపోయారు.. అని బీజేపీ సీనియర్ నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి ఆరోపించారు.

    మొదట ప్రత్యేక ప్యాకేజీకి చంద్రబాబు అంగీకరించారని ఆయన గుర్తుచేశారు. కేంద్ర ఆర్థిక మంత్రికి ధన్యవాదాలు తెలుపుతూ అసెంబ్లీలో తీర్మానం కూడా చేశారని అన్నారు. ప్యాకేజీని స్వాగతిస్తున్నామని అంటూ చంద్రబాబు న్యూఢిల్లీలో పలువురు కేంద్రమంత్రులకు శాలువాలు కప్పి, సన్మానం చేశారని చెప్పారు. అనంతరం ప్రత్యేక హోదా కావాలంటూ యూ టర్న్ తీసుకున్నారని ఎద్దేవా చేశారు. విజయవాడలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

    State govt mishandling TTD revenue: Subramanya Swamy

    తిరుమల తిరుపతి దేవస్థానం నిధులను చంద్రబాబు ప్రభుత్వం ఇష్టానుసారంగా వాడేస్తోందని విమర్శించారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా టీటీడీ నిధులు దారి మళ్లుతున్నాయని ఆయన ధ్వజమెత్తారు. ఈ విషయంపై తాను న్యాయపరంగా పోరాడుతున్నానని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధీనం నుంచి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని తప్పించాలంటూ తాను హైకోర్టులో రిట్ పిటీషన్ దాఖలు చేశానని గుర్తుచేశారు. దీన్ని హైకోర్టు విచారణకు స్వీకరించిందని ఆయన తెలిపారు.

    తిరుమల తిరుపతి దేవస్థానంపై న్యాయస్థానాల పర్యవేక్షణ ఉండాలన్నది తన అభిప్రాయమని చెప్పారు. భక్తులు ఇచ్చే కానుకల రూపంలో స్వామివారికి అందుతున్న కోట్లాది రూపాయల లావాదేవీలను న్యాయస్థానం నేరుగా పర్యవేక్షించేలా ఓ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి తాను ప్రయత్నిస్తున్నానని అన్నారు. తాను దాఖలు చేసిన రిట్ పిటీషన్ వచ్చేనెల 6వ తేదీన విచారణకు రానుందని సుబ్రహ్మణ్య స్వామి తెలిపారు.

    తిరుమల ఆలయ నిర్వహణ అర్చకుల ఆధీనంలోనే ఉండాలి తప్ప, ప్రభుత్వ పెత్తనం సరికాదని చెప్పారు. అప్పుడే ఆలయానికి ఉన్న పవిత్రతను కాపాడినట్టవుతుందని, ప్రభుత్వ జోక్యం ఉంటే.. రాజకీయ నాయకులు పెత్తనం చలాయిస్తారని విమర్శించారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+