TTD: భక్తులకు మలయప్పస్వామి కటాక్షం..!!

Tirumala: బ్రహ్మండనాయకుని బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శ్రీవారి సర్వదర్శనం చాలా త్వరగానే అయిపోతోంది. శ్రీవారి దర్శనానికి భక్తులు 4 కంపార్ట్‌మెంట్లలో వేచిఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.72 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. నేడు శ్రీవారి బ్రహ్మోత్సవాలు రెండో రోజుకు చేరుకున్నాయి.

తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇవాళ ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి ఉద‌యం బంగారు తిరుచ్చిపై ఆల‌య నాలుగు మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. రాత్రి ఉభయదేవేరులతో కలిసి వైకుంఠనాథుని అలంకారంలో పెదశేవ వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. ఆదిశేషుడు తన పడగనీడలో స్వామివారిని సేవిస్తూ పాన్పుగా దాస్యభక్తిని చాటారు. ఆదిశేషుడు శ్రీహరికి మిక్కిలి సన్నిహితుడు. రామావతారంలో లక్ష్మణుడుగా, ద్వాపరంలో బలరాముడుగా శ్రీమన్నారాయణుడికి మిక్కిలి సన్నిహితంగా ఉన్నవాడు శేషుడు. ఈయన శ్రీభూదేవి సహితుడైన శ్రీవేంకటేశ్వరుని వహిస్తూ తొలిరోజు భక్తులకు దర్శనమిచ్చారు.

The Chinna Sesha Vahana Seva was held on the second day evening of the ongoing Navaratri Brahmotsavams

ఈ సంద‌ర్భంగా స్వామి, అమ్మవార్లకు ధూపం, దీపం, అర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం స‌మ‌ర్పించి శోడ‌షోప‌చారాలు చేసారు. ఇందులో వేదపండితులు దివ్య‌ప్ర‌బంధాన్ని ప‌ఠించారు. చివ‌ర‌గా అర్చ‌కుల‌కు శ‌ఠారి, బ‌హుమానం స‌మ‌ర్పించారు. వాహ‌న‌సేవ‌ల్లో అల‌సిపోయిన స్వామి, అమ్మ‌వార్ల‌కు ఉప‌శ‌మ‌నం క‌ల్పించేందుకు ఈ కొలువు నిర్వ‌హిస్తార‌ని అర్చ‌కులు తెలిపారు. సోమవారం ఉదయం ఈ రోజు శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు చిన్నశేష వాహనం స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి హంస వాహనాలపై స్వామివారు కనువిందు చేయనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+