తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఒక రోజులో 5.21 కోట్ల ఆదాయం, తిరుమల శ్రీవారికి భక్తుల కానుకలు..

|
Google Oneindia TeluguNews

అఖిలాండ కోటి బ్రహ్మండ నాయకుడు, తిరుమల శ్రీవారికి రికార్డుస్థాయిలో ఆదాయం సమకూరింది. గురువారం రూ.5.21 కోట్ల ఆదాయం వచ్చింది. అంతకుముందు డిసెంబర్‌లో రూ.4.39 కోట్ల ఆదాయం వచ్చింది. లాక్‌డౌన్ తర్వాత ఈ స్థాయిలో ఆదాయం వస్తోంది. గురువారం ఒక్కరోజు 50 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 25 వేల 466 మంది తలనీలలు సమర్పించుకున్నారు..

తిరుమల శ్రీవారి ఉత్సవ మూర్తులకు ఇక నుండి ఏడాదికి ఒకసారే అభిషేకం .. టీటీడీ బోర్డు ఆమోదం .. ఇదే కారణం !!తిరుమల శ్రీవారి ఉత్సవ మూర్తులకు ఇక నుండి ఏడాదికి ఒకసారే అభిషేకం .. టీటీడీ బోర్డు ఆమోదం .. ఇదే కారణం !!

లాక్ డౌన్ తర్వాత శ్రీవారి ఆలయానికి ఆదాయం తగ్గిపోయింది. భక్తులు రాక హుండీ ఆదాయం తగ్గగా.. తలనీలాలు కూడా సమర్పించేవారు లేరు. కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత భక్తుల రాకపోకల వివరాలను అధికారులు పరిశీలిస్తున్నారు. రూ.300 స్పెషల్ దర్శన టికెట్లు, భక్తుల సర్వదర్శనం వివరాలను మీడియాకు వెల్లడించారు.

tirumala hundi record collections of rs 5.21 crore in one day

ఈ నెల 24వ తేదీ నుంచి 28వ తేదీ వరకు శ్రీవారి తెప్పొత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆర్జిత సేవలను టీటీడీ రద్దుచేసింది. 24, 25వ తేదీలలో సహస్ర దీపాలంకరణ, ఆర్జిత బ్రహ్మోత్సవం, చేస్తారు. ఏప్రిల్ 14 తర్వాత ఆర్జిత సేవలను పునరుద్దరిస్తామని టీటీడీ పాలకమండలి తెలియజేసింది. ఇప్పుడు బిజీ షెడ్యూల్ వల్ల రద్దు చేశామని వివరించారు.

English summary
ttd received record breaking collection of rs 5.21 crores. highest after the sri venkateshwara swamy temple opened for darshan from june 8th after lockdown rules relaxed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X