Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

TTD: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్. నేడే దర్శనం టికెట్లు జారీ..!

శ్రీవారి శ్రీవాణి టికెట్లను టీటీడీ ఇవాళ విడుదల చేయనుంది.

తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులకు శుభవార్త చెప్పింది టీటీడీ. స్వామివారిని దర్శించుకోవడానికి టికెట్లు విడుదల చేయనున్నట్లు తెలిపింది. మంగళవారం టీటీడీ శ్రీవాణి టికెట్లను ఆన్ లైన్ లో విడుదల చేయనుంది. జూన్ నెలకు సంబంధించి శ్రీవాణి టికెట్లను ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనుంది. స్వామి వారి సేవకు సంబంధించి కూడా టికెట్లను త్వరలో విడుదల చేయనున్నట్లు పేర్కొంది.

వెంకటేశ్వర స్వామి ఆర్జిత సేవా టికెట్లు జూన్ మాసానికి సంబంధించి మార్చి 23న ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనుంది టీటీడి. ఈ సేవాల్లో ఊంజల్ సేవ, కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార ఉన్నాయి. దీంతో పాటు జూన్ నెలకు సంబంధించి పలు ఆర్జిత సేవలకు ఆన్ లైన్ లక్కీడీప్ నమోదుకు మార్చి 24 ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. ఈ లక్కీడిప్ లో టికెట్ల వచ్చిన వారు డబ్బులు చెల్లించాలి.

Tirumala Tirupati Devastanam Will Release Online tokens today

అలాగే జూన్ నెలకు సంబంధించి అంగప్రదక్షిణ టికెట్లను మార్చి 24న ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నారు. వృద్ధులు, దివ్యాంగులు కొటాకు సంబంధించి శ్రీవారి దర్శన టికెట్లను మార్చి 24న మధ్యాహ్నం టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయనుంది. ఈ టికెట్ల ఏప్రిల్ నెలకు సంబంధించినవి.

సోమవారం తిరుమల శ్రీవారిని సినీ నటులు మంచు విష్ణు, విశ్వక్ సేన్ దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనంలో శ్రీవారిని దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు స్వాగతం పలికారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+