Tirumala: శ్రీవారి రెండు నెలల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల - నేటి నుంచి..!!
వేసవిలో తిరుమలకు వచ్చే భక్తుల కోసం టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. మే, జూన్ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల సమయం ప్రకటించింది. నేటి నుంచి ఆర్జిత సేవా..శ్రీవాణి ాన్ లైన్ కోటా టికెట్లు...ఆ తరువాత అంగప్రదక్షిణం టోకెన్లు..వర్చ్యువల్ సేవాల కోటా ఇలా..వరుసగా అయిదు రోజుల పాటు టీటీడీ భక్తులకు టోకెన్లను విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ నెల 26,27 తేదీల్లో మే నెల తిరుమల, తిరుపతి వసతి గదుల కోటాను విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది.
నేడు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల విడుదల: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన జూలై నెల కోటాను ఈ రోజు (గురువారం) ఉదయం 10 గంటలకు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఈ సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఏప్రిల్ 22వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. మధ్యాహ్నం 12 గంటలకు లక్కీడిప్ లో టికెట్లు మంజూరవుతాయి. ఈ టికెట్లు పొందిన వారు సొమ్ము చెల్లించి ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది.

అదేవిధంగా, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవాటికెట్ల కోటాను ఈ రోజు (గురువారం )ఉదయం 11.30 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన జూలై నెల ఆన్ లైన్ కోటాను కూడా ఈ మధ్యాహ్నం 3 గంటలకు టిటిడి విడుదల చేయనుంది.
ఏప్రిల్ 21న అంగప్రదక్షిణం టోకెన్లు: జూలై నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను ఏప్రిల్ 21న ఉదయం 10 గంటలకు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా మే నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను ఏప్రిల్ 21న మధ్యాహ్నం 3 గంటలకు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన మే నెల కోటాను ఏప్రిల్ 24న ఉదయం 10 గంటలకు, జూన్ నెల కోటాను ఏప్రిల్ 24న మధ్యాహ్నం 3 గంటలకు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
ఏప్రిల్ 25న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు: మే, జూన్ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఏప్రిల్ 25న ఉదయం 10 గంటలకు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. తిరుమలలో మే నెల గదుల కోటాను ఏప్రిల్ 26న ఉదయం 10 గంటలకు, తిరుపతిలో మే నెల గదుల కోటాను ఏప్రిల్ 27న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.
మే నెలలో సాధారణంగా తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. దర్శనం తో పాటుగా వసతి కోసం భక్తులు పెద్ద సంఖ్యలో నిరీక్షిస్తారు. ఈ రెండు నెలలకు సంబంధించిన దర్శనం..వసతి టికెట్లను టీటీడీ అధికారిక వెబ్ సైట్..యాప్ ద్వారా పొందవచ్చని టీటీడీ స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications