వెన‌క్కి త‌గ్గిన వైవీ సుబ్బారెడ్డి: తాడేప‌ల్లిలో క్యాంపు కార్యాల‌యం ఏర్పాటుపై క్లారిటీ!

తిరుప‌తి: త‌న క్యాంపు కార్యాల‌యం రాజ‌ధాని అమ‌రావ‌తి ప్రాంతంలోని తాడేప‌ల్లిలో ఏర్పాట‌వుతుందంటూ వ‌స్తోన్న వార్త‌ల‌పై ఎట్ట‌కేల‌కు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఛైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. అది క్యాంపు కార్యాల‌యం కాద‌ని తేల్చి చెప్పారు. క్యాంపు కార్యాల‌యాన్ని తాడేప‌ల్లిలో ఏర్పాటు చేయాల‌నే ఆలోచ‌న త‌న‌కు లేద‌ని అన్నారు. ఈ వార్త ఎలా పుట్టుకొచ్చింద‌నే విష‌యంపై ఆరా తీయాల‌ని తాను దేవ‌స్థానం అధికారుల‌ను ఆదేశించిన‌ట్లు చెప్పారు. తాడేప‌ల్లిలో ఏర్పాటు చేయ‌బోయేది టీటీడీ స‌మాచార కేంద్రం మాత్ర‌మేన‌ని ఆయ‌న వివ‌ర‌ణ ఇచ్చారు.

బుధ‌వారం ఆయ‌న తిరుప‌తిలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో టీటీడీ కార్య‌నిర్వ‌హ‌ణాధికారి అనిల్ కుమార్ సింఘాల్‌తో క‌లిసి మాట్లాడారు. త‌న క్యాంపు కార్యాల‌యాన్ని రాజ‌ధాని అమ‌రావ‌తి ప్రాంతంలోని తాడేప‌ల్లిలో ఏర్పాటు చేస్తానంటూ వ‌స్తోన్న వార్త‌లు నిరాధార‌మైన‌వ‌ని అన్నారు. తాడేప‌ల్లిలో ఏర్పాటు చేయ‌బోయేది స‌మాచార కేంద్ర‌మేన‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌స్తుతం టీటీడీకి సమాచార కేంద్రాలు హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు, న్యూఢిల్లీల్లో ఎప్ప‌టి నుంచో ఉన్నాయ‌ని అన్నారు. భక్తుల సౌకర్యార్ధం అలాంటి కార్యాల‌యాన్ని తాడేప‌ల్లి ప్రాంతంలో ఏర్పాటు చేయాల‌ని తాను అధికారుల‌ను ఆదేశించిన‌ట్లు తెలిపారు.

TTD Chairman YV Subba Reddy denied the reports that is not my camp office

రాజధాని కాబట్టి అమరావతిలో పెట్టాలనేది త‌మ ఆలోచ‌న అని తెలిపారు. ప్ర‌స్తుతం టీటీడీ అక్క‌డ 150 కోట్ల‌తో న‌మూనా ఆల‌యాన్ని నిర్మిస్తోంద‌ని, దీనికి అనుబంధంగా స‌మాచార కేంద్రం ఏర్పాటు చేస్తామ‌ని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. దీనిద్వారా భక్తులకు వివిధ రకాల సేవలకు సంబంధించిన రిజర్వేషన్లు, టికెట్ల బుకింగ్ వంటి స‌మ‌స్త స‌మాచారాన్ని పొంద‌వ‌చ్చ‌ని చెప్పారు. చంద్ర‌బాబు ప్రభుత్వం విజయవాడలో ఒక్కో చ‌ద‌ర‌పు అడుగున‌కు 11,500 రూపాయ‌ల అద్దెను చెల్లించి టీటీడీ ప్రాంతీయ కార్యాలయాన్ని న‌డుపుతోంద‌ని అన్నారు. దుబారాను నియంత్రించ‌డంలో భాగంగా- ఈ ప్రాంతీయ కార్యాల‌యాన్ని స‌చివాల‌యంలో ఉచితంగా ఏర్పాటు చేయాల‌ని సూచించిన‌ట్లు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+