తిరుమలలో మహిమాన్విత కుమారధార తీర్థ ముక్కోటి - ప్రత్యేక ఏర్పాట్లు....!!
తిరుమల పుణ్యతీర్థాల్లో ఒకటైన శ్రీ కుమారధార తీర్థ ముక్కోటిని ఏ ఏడాది మార్చి 7వ తేదీ న నిర్వహించనున్నారు.
Tirumala: ప్రపంచ ప్రసిద్ద పుణ్యక్షేత్రం తిరుమలలో ఎన్నో మహిమాన్విత ప్రదేశాలు ఉన్నాయి. అందులో కుమార ధార తీర్థంది ప్రత్యేక స్థానం. తిరుమల శేషాచల అడవుల్లోని పుణ్యతీర్థాల్లో ఒకటైన శ్రీ కుమారధార తీర్థ ముక్కోటిని ఏ ఏడాది మార్చి 7వ తేదీ న నిర్వహించనున్నారు. ఈ తీర్థానికి ఉన్న చరిత్ర..ప్రత్యేకత కారణంగా ఆ రోజున పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. కుమార ధార తీర్థ లో స్నానం ఆచరించటానికి ప్రాధాన్యత ఇస్తారు. కుమార ధార తీర్ధానికి సంబంధించిన వరహ, మార్కండేయ, పద్మ పురాణాల ప్రకారం అనేక కధలు ప్రచారంలోకి వచ్చాయి. దీంతో..ఇప్పుడు ఈ తీర్ధం వద్ద భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
పవిత్ర పుణ్యక్షేత్రం అయిన తరుమలలోని శేషాచల అడవుల్లో ఈ పుణ్యతీర్ధం ఉంది. ఇక్కడకి ప్రతీ ఏటా వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా ఉంటుంది. ఈ సారి మార్చి 7న తీర్ధ ముక్కోటిని నిర్వహించనున్నారు. ఈ పుణ్యతీర్దానికి సంబంధించి ప్రధానం ఒక కధ ప్రచారంలో ఉంది. వృద్ద బ్రాహ్మణుడు శేషాచల గిరుల్లో ఒంటరిగా సంచరిస్తున్న సమయంలో శ్రీ వేంకటేశ్వరస్వామి ప్రత్యక్షమై ఆ వృద్ధ బ్రహ్మణుడితో ఈ వయస్సులో చెవులు వినిపించవు, కళ్లు కనిపించవు.. అడవిలో ఏంచేస్తున్నావని ప్రశ్నించగా.. ఆ వృద్ధుడు.. తాను యజ్ఞయాగాలు ఆచరించి దైవరుణం తీర్చుకోవాలనే తలంపుతో ఉన్నాను అని స్వామివారికి చెప్పాడు. అప్పుడు ఆ వృద్ధ బ్రాహ్మణుడి సలహా ఇచ్చారని.. ఈ తీర్ధంలో వృద్ధుడు స్నానమచరించగా 19 ఏళ్ల నవ యువకుడిగా మారిపోయాడు. అలా ముసలి వయసు నుంచి కౌమార్యంలోకి మారిపోవడం వల్ల ఈ తీర్థానికి 'కుమార ధార' అనే పేరు వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి.

కుమార ధార తీర్థంలో స్నానం చేసి తమ శక్తి మేరకు దానాలు చేసిన వారికి ఉత్తమగతులు లభిస్తాయని భక్తుల నమ్మకం. కనుక కుమార తీర్ధ ముక్కోటికి భారీ సంఖ్యలో భక్తులు తీర్ధంలో స్నానం ఆచరించేందుకు ప్రాధాన్యత ఇస్తారు. తిరుమలలో ప్రస్తుతం సాలకట్ల తెప్పోత్సవాలు జరుగుతున్నాయి. రుక్మిణీకృష్ణులు తెప్పపై భక్తులకు దర్శనమిచ్చారు. రుక్మిణి సమేత శ్రీకృష్ణుల ఉత్సవమూర్తుల ఊరేగింపు జరిగింది. ఆలయ నాలుగు మాడ వీధుల గుండా పుష్కరిణిలో తెప్పపై మూడు చుట్లు తిరిగి కనువిందు చేశారు. ఇదే సమయంలో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వారాంతపు సెలవు దినం కావడంతో ఆదివారం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు.












Click it and Unblock the Notifications