తిరుమలలో సరికొత్త వ్యవస్థ- ఇంకొన్ని గంటల్లోనే అమలు..!!

ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో కొత్తగా మరో అధునాతన వ్యవస్థ అందుబాటులోకి రానుంది. బుధవారం నుంచి దీన్ని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టాలని టీటీడీ అధికారులు నిర్ణయించారు.

తిరుపతి: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. ఒకట్రెండు కంపార్ట్‌మెంట్లల్లోనే భక్తులు వేచి ఉంటోన్నారు. సోమవారం 71,387 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 24,701 మంది తలనీలాలను సమర్పించుకున్నారు. స్వామివారికి మొక్కులు చెల్లించారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి హుండీ ద్వారా వచ్చిన ఆదాయం భారీగా నమోదైంది. 5.71 కోట్ల రూపాయలుగా రికార్డయింది.

పరీక్షల సీజన్..

పరీక్షల సీజన్..

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వివిధ రకాల పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్స్ వెలువడిన విషయం తెలిసిందే. విద్యార్థులు వాటికి సన్నద్ధమౌతోన్నారు. ఈ షెడ్యూల్స్ అన్నీ ముగిసిన తరువాత తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశం ఉందని టీటీడీ అధికారులు అంచనా వేస్తోన్నారు. వేసవి సెలవుల్లో శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని, దీనికి అనుగుణంగా ముందస్తు చర్యలను తీసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు.

కొత్త వ్యవస్థకు శ్రీకారం..

కొత్త వ్యవస్థకు శ్రీకారం..

ఈ పరిణామాల మధ్య తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సరికొత్త నిర్ణయాన్ని తీసుకున్నారు. తిరుమలలో కొత్తగా ఫేసియల్ రికగ్నిషన్ వ్యవస్థను ప్రవేశపెట్టనున్నారు. దళారుల ప్రమేయం లేకుండా చేయడానికి ఈ వ్యవస్థను అందుబాటులోకి తీసుకుని రానున్నారు. దీనికి ముహూర్తాన్ని కూడా పెట్టారు టీటీడీ అధికారులు.

ఇంకొన్ని గంటల్లో..

ఇంకొన్ని గంటల్లో..

ఇవ్వాళ్టి నుంచే ఈ ఫేసియల్ రికగ్నిషన్ వ్యవస్థ అందుబాటులోకి రానుంది. ఇది ప్రస్తుతానికి ప్రయోగాత్మకమే. ఇది విజయవంతమైతే- మరింత విస్తృతం చేస్తారు టీటీడీ అధికారులు. తిరుమలలో ఉన్న గదుల కేటాయింపు కౌంటర్లు, కాషన్ డిపాజిట్ తిరిగి చెల్లించే కౌంటర్ల వద్ద దీన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నారు. రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి టోకెన్లు లేకుండా సర్వదర్శనానికి వెళ్లే భక్తులకు కూడా ఫేసియల్ రికగ్నిషన్ ను ఉపయోగించి లడ్డూలను జారీ చేస్తారు.

విస్తృతం చేయడంపై..

విస్తృతం చేయడంపై..

గదుల కేటాయింపు, లడ్డూ ప్రసాదాల టికెట్ల విక్రయాలు, భక్తులు ముందస్తుగా చెల్లించే కాషన్‌ డిపాజిట్‌ రీఫండ్ చేయడానికి ఉద్దేశించిన కౌంటర్లు వద్ద ఎఫ్ఆర్టీ యంత్రాలను అమర్చుతారు. ఇది దళారీ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించడానికి ఉపయోగపడుతుందని టీటీడీ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతానికి ప్రయోగాత్మకంగా దీన్ని ప్రవేశపెడతామని, దీనివల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయనేది అధ్యయనం చేస్తామని అంటున్నారు. భక్తుల నుంచి కూడా ఫీడ్ బ్యాక్ తీసుకుని- విస్తృతం చేస్తామని వివరిస్తోన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+