Tirumala: శ్రీవారి లడ్డూ ప్రసాదం పై టీటీడీ కీలక నిర్ణయం..!!
శ్రీవారి భక్తులకు లడ్డూ ప్రసాదం విక్రయాలకు సంబంధించి టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.
Tirumala: శ్రీవారి భక్తులకు లడ్డూ ప్రసాదం విక్రయాలకు సంబంధించి టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలలో ప్రకృతి పరిరక్షణలో భాగంగా ఈ నిర్ణయం అమలుకు సిద్దం అవుతోంది. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి ఉన్న ప్రాధాన్యత మాటల్లో చెప్పలేనిది. 307 ఏళ్లు చరిత్ర ఉన్న ఈ తిరుమల ప్రసాదాన్ని కోట్లాది మంది భక్తులు భక్తితో స్వీకరిస్తారు.
తిరుమల లడ్డూకు వచ్చే రుచి మరెక్కడా లభించదు. తిరుమల లడ్డూ అన్ని రకాలుగా ప్రత్యేకమైనదే. దశాబ్దాల కాలంగా ఒకే రుచితో ఎక్కడా రాజీ పడకుండా ఈ లడ్డూ తయారీ కొనసాగుతోంది. ఇప్పుడు ఇదే లడ్డు కేంద్రాల్లో ప్రకృతి పరిరక్షణ..సంప్రదాయ వృత్తుకలు చేయూత అందించే విధంగా తాజాగా చర్యలు ప్రారంభించింది.

లడ్డూ ప్రసాదాల పంపిణీ కోసం
తిరుమలలో లడ్డూ ప్రసాదాల పంపిణీకి సంబంధించి టీటీడీ ఈ మధ్య కాలంలోనే పలు నిర్ణయాలు తీసుకుంది. లడ్డూ కేంద్రాల పెంపుతో పాటుగా ప్రసాదం తయారీ కోసం ఆత్యాధునిక యంత్రాల వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇప్పుడు తాజాగా తాటాకు బుట్టలను లడ్డూ విక్రయా కేంద్రాల్లో బక్తులకు అందుబాటులోకి తేవాలని భావిస్తోంది. దీనికి సంబంధించి పలు రకాల బుట్టలను ఈవో ధర్మారెడ్డి పరిశీలించారు. ప్రకృతి కి మేలు చేయటంతో పాటుగా పలువురికి ఉపాధి కల్పించినట్లు అవుతుందని భావిస్తున్నారు.
ప్రకృతి వ్యవసాయ వేత్త విజయరామ్ సహకారంతో బుట్టలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే తీసుకున్న నిర్ణయం మేరకు తిరుమలలో లడ్డూల తయారీ కోసం డిసెంబరు నాటికి రూ.50కోట్లతో కొత్త వ్యవస్థ అందుబాటులోకి రానుంది.

రోజుకు ఆరు లక్షల లడ్డూల పంపిణీ
తిరుమలలో రోజుకు ఆరు లక్షల లడ్డూల తయారీకి వీలుగా నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం ఆత్యాధునిక యంత్రాల వ్యవస్థ అందుబాటులోకి రానుంది. ఈ యంత్రాలు వాడుకలోకి వస్తే బూందీ తయారీకి స్టవ్‌ల అవసరం ఉండదు. ఈ యంత్రాలను స్విట్జర్లాండ్, జర్మనీ, ఆస్ట్రేలియా నుంచి తెప్పిస్తున్నారు. అవసరమైన అన్ని పదార్ధాలు వేస్తే ఆ యంత్రమే లడ్డూ తయారీ చేస్తుందని అధికారులు వెల్లడించారు.
దీని ద్వారా పెరుగుతున్న భక్తులకు తగినంత స్థాయిలో లడ్డూలు వేగంగా సిద్దం చేయటానికి అవకాశం ఏర్పుడుతందని చెప్పారు. నాణ్యత విషయంలో ఏ మాత్రం తేడా ఉండదని చెప్పుకొచ్చారు. రద్దీ రోజుల్లో తిరుమలకు వచ్చే భక్తులకు లడ్డూ ప్రసాదం అందుబాటులోకి తెచ్చేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నామని టీటీడీ అధికారులు చెబుతున్నారు.

శ్రీవాణి టికెట్లు ఆఫ్ లైన్ లో అందుబాటులో
తిరుమలలో నేడు శ్రీవాణి దర్శన టికెట్లను టీటీడీ అందుబాటులోకి తీసుకొస్తోంది. మార్చి, ఏప్రిల్, మే నెలలకు సంబంధించి ఆన్ లైన్ టికెట్ల కోటాను ఈ మధ్నాహ్నం 12 గంటలకు విడుదల చేయనున్నారు. ఆన్ లైన్ విధానంలోకి రోజుకు 500 టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. తిరుమల టీటీడీ జేఈవో కార్యాలయం గోకులంలో ఆఫ్‌లైన్‌లో శ్రీవాణి టిక్కెట్ల జారీని టీటీడీ పునఃప్రారంభించింది.
ఈ కార్యాలయంలో రోజుకు 400 టికెట్లు..100 టికెట్లను తిరుపతి విమానాశ్రయంలో కరెంట్ బుకింగ్ కింద జారీ చేస్తున్నారు. తిరుమలలో ఫిబ్రవరి 28వ తేదీ వరకు రోజుకు 150 శ్రీవాణి టికెట్లను జారీ చేయనున్నారు.
మార్చి నుంచి, 1000 శ్రీవాణి టిక్కెట్లలో, 500 ఆన్‌లైన్‌లో, 400 తిరుమలలోని గోకులం కార్యాలయంలో, 100 తిరుపతి విమానాశ్రయంలో కరెంట్ బుకింగ్ కింద భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చేలా నిర్ణయించారు.












Click it and Unblock the Notifications