తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

TTD: ఏకాంతంగా తిరుమల శ్రీవారి బ్రహోత్సవాలు, కరోనా దెబ్బతో భక్తులకు అవకాశం లేదు, వైవీ సుబ్బారెడ్డి !

|
Google Oneindia TeluguNews

తిరుమల/ తిరుపతి: శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈసారి కూడా ఏకాంతంగానే నిర్వహించాలని నిర్ణయించినట్లు టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి ప్రకటించారు.
తిరుమల అన్నమయ్య భవన్లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తాజాగా జారీ చేసిన కోవిడ్ మార్గదర్శకాలను అనుసరించి భక్తులు, సిబ్బంది ఆరోగ్య భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని టీటీడీ చైర్మన్ వైవీ. సుబ్బారెడ్డి చెప్పారు.

TTD: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, అందుబాటులో విష్ణు నివాసం రూమ్స్, 50% ఆన్ లైన్ లో, సదా భార్గవి ఆదేశాలు !TTD: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, అందుబాటులో విష్ణు నివాసం రూమ్స్, 50% ఆన్ లైన్ లో, సదా భార్గవి ఆదేశాలు !

ఈ సంవత్సరం కరోనా దెబ్బ

ఈ సంవత్సరం కరోనా దెబ్బ


కోవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూ రోజుకు 15 నుంచి 20 వేల మంది భక్తులకు మాత్రమే ఎలాంటి ఇబ్బంది లేకుండా స్వామివారి దర్శన భాగ్యం కల్పిస్తున్నామని టీటీడీ చైర్మన్ వైవీ. సుబ్బారెడ్డి చెప్పారు. మరికొంత కాలం ఇదే పరిస్థితి కొనసాగుతుందని టీటీడీ చైర్మన్ వైవీ. సుబ్బారెడ్డి వివరించారు. ఆన్ లైన్ సర్వదర్శనం టోకెన్లు విడుదల చేసే కార్యక్రమం సాంకేతిక కారణాల వల్ల ఆలస్యమైందని, త్వరలోనే ఈ సమస్యను అధిగమించి ఆన్ లైన్ లో సర్వ దర్శనం టోకెన్లు విడుదల చేస్తామని టీటీడీ చైర్మన్ వైవీ. సుబ్బారెడ్డి చెప్పారు.

Aditi Budhathoki: నేపాలీ బ్యూటీ 'అదితి బుధతోకి'.. హాట్ బికినీ అందాలకు ఫిదా అవ్వాల్సిందే! (ఫోటోలు)Aditi Budhathoki: నేపాలీ బ్యూటీ 'అదితి బుధతోకి'.. హాట్ బికినీ అందాలకు ఫిదా అవ్వాల్సిందే! (ఫోటోలు)

పవిత్రోత్సవాలు

పవిత్రోత్సవాలు

తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి పవిత్రోత్సవాల్లో భాగంగా శుక్ర‌వారం ఉద‌యం శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి, తోమాలసేవ, సహస్రనామార్చన నిర్వహించారు.

శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజస్వామి

శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజస్వామి

ఉద‌యం 8.30 నుండి 10.30 గంట‌ల వ‌ర‌కు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవింద‌రాజ‌స్వామివారి ఉత్సవర్లను యాగశాలకు వేంచేపు చేసి వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. ఉద‌యం 10.30 నుండి 11.30 గంట‌ల వ‌ర‌కు స్నపనతిరుమంజనం జరిగింది. ఇందులో ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, కొబ్బరినీళ్లు, తేనె, ప‌సుపు, చందనంలతో అభిషేకం నిర్వహించారు.

అనంతరం మూలవర్లకు, బాలాల‌యంలోని స్వామివారి మూర్తికి, ఉత్సవర్లకు, ఉప ఆలయాలకు, ప‌రివార దేవ‌త‌ల‌కు, ధ్వజస్తంభానికి, శ్రీ మఠం ఆంజనేయస్వామివారికి పవిత్రాలు సమర్పించారు.

Recommended Video

Ys Jagan : గాంధీ జయంతి రోజునే సంచలనం.. ఇక ప్రజల్లోనే | Ys Jagan Cares || Oneindia Telugu
పెద్ద జియ్యర్ స్వామి, చిన్నజియ్యర్ స్వామి

పెద్ద జియ్యర్ స్వామి, చిన్నజియ్యర్ స్వామి


ఈ కార్యక్రమంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద జీయ‌ర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్‌ స్వామి, ఆలయ ప్ర‌త్యేకశ్రేణి డెప్యూటీ ఈవో రాజేంద్రుడు, ఆల‌య ప్ర‌ధానార్చ‌కులు పి.శ్రీ‌నివాస దీక్షితులు, ఆగ‌మ స‌ల‌హాదారు శ్రీ వేదాంతం విష్ణుభ‌ట్టాచార్యులు, ఏఈవో ర‌వికుమార్‌రెడ్డి, సూప‌రింటెండెంట్ నారాయ‌ణ, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ కామ‌రాజు పాల్గొన్నారు.

English summary
TTD: Tirumala Tirupati Brahmotsavam 2021, Covid rules follow.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X