Tirupati: తిరుమలలో సాంప్రదాయ భోజనాలు, భక్తుల ఆరోగ్యం ముఖ్యం, అన్నమయ్య క్యాంటీన్ లో !

తిరుమల/ తిరుపతి: గో ఆధారిత ప్ర‌కృతి వ్య‌వ‌సాయం ద్వారా పండించిన ఉత్ప‌త్తుల‌తో వండిన సంప్ర‌దాయ భోజ‌నాన్ని శుక్ర‌వారం టీటీడీ ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి స్వీక‌రించారు. తిరుమ‌ల అన్న‌మయ్య భ‌వ‌నం క్యాంటీన్‌లో టీటీడీ గురువారం నుండి వారం రోజుల పాటు సంప్ర‌దాయ భోజ‌నాన్ని ప్ర‌యోగాత్మ‌కంగా ప‌రిశీలిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ఈవో జవహర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ దాత‌ల స‌హకారంతో తిరుమ‌లలో సంప్ర‌దాయ భోజ‌నాన్ని ప్ర‌వేశ‌పెట్టేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టామ‌న్నారు. గో ఆధారిత ప్ర‌కృతి వ్య‌వ‌సాయం ద్వారా పండించిన ఉత్ప‌త్తులతో త‌యారుచేసిన ఆహారాన్ని భుజించ‌డం వ‌ల్ల వ్యాధి నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంద‌ని, క‌రోనా స‌మ‌యంలో శాస్త్రవేత్త‌లు కూడా ఇలాంటి ఆహారంపై చ‌ర్చిస్తున్నార‌ని టీటీడీ ఈవో జవహర్ రెడ్డి తెలిపారు.

పట్టణాలతో పోల్చుకుంటే గ్రామాల్లోనే ఆరోగ్యవంతులు

పట్టణాలతో పోల్చుకుంటే గ్రామాల్లోనే ఆరోగ్యవంతులు

ప‌ట్ట‌ణ‌వాసుల‌తో పోల్చుకుంటే గ్రామాల్లో స‌హ‌జసిద్ధంగా ల‌భించే ఆహారం తీసుకునే వారికి వ్యాధి నిరోధ‌క శ‌క్తి ఎక్కువ‌గా ఉంటుంద‌ని, ఈ సందేశాన్ని ప్ర‌జ‌ల్లోకి పంపడం, గో ఆధారిత వ్య‌వ‌సాయాన్ని ప్రోత్స‌హించ‌డం ద్వారా గోమాత‌ను ర‌క్షించుకోవ‌డం టీటీడీ ముఖ్య ఉద్దేశాల‌ని టీటీడీ ఈవో జవహర్ రెడ్డి అన్నారు. లాభాపేక్ష లేకుండా సంప్ర‌దాయ భోజ‌నాన్ని భ‌క్తుల‌కు అందిస్తామ‌ని, ముడిప‌దార్థాల‌న్నీ సిద్ధం చేసుకుని శాశ్వ‌త ప్రాతిప‌దికన దీన్ని అమ‌లుచేసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నామ‌ని టీటీడీ ఈవో జవర్ రెడ్డి వివ‌రించారు.

తిరుమలలో మొదటిసారి ప్రయోగం

తిరుమలలో మొదటిసారి ప్రయోగం


ప్రపంచ ప్రసిద్ది చెందిన శ్రీవెంకటేశ్వర స్వామి కొలువు తీరిన తిరుమలలో మొదటిసారి టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారి భక్తుల కొసం సాంప్రదాయ భోజనాలు ప్రయోగాత్మకంగా అన్నమయ్య భవన్ ప్రారంభించారు. వారం రోజుల పాటు అన్నమయ్య భవన్ లో శ్రీవారి భక్తులకు గో ఆధారిత ప్ర‌కృతి వ్య‌వ‌సాయం ద్వారా పండించిన ఉత్ప‌త్తుల‌తో వండిన సంప్ర‌దాయ భోజ‌నాన్ని వడ్డించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇప్పటికే శ్రీవారికి నైవేద్యం

ఇప్పటికే శ్రీవారికి నైవేద్యం

ఇప్పటికే గోవింద‌దునికి గో ఆధారిత నైవేద్యం అందించడంలో భాగంగా దేశీయ గోవుల ఉత్పత్తులతో చేసిన వ్య‌వ‌సాయం ద్వారా పండించిన బియ్యం, ప‌ప్పు దినుసులు, బెల్లం, నెయ్యితో శ్రీవారికి అన్న ప్రసాదాల నైవేద్యం అందిస్తున్న విష‌యం తెలిసిందే. అదేవిధంగా దేశీయ వ్య‌వ‌సాయంతో పండించిన బియ్యం, ప‌ప్పు దినుసుల‌తో త‌యారు చేసిన అల్ఫాహ‌రం, భోజ‌నం ఎలాంటి ఆదాయం లేకుండా కాస్టు టు కాస్టుతో టీటీడీ భ‌క్తుల‌కు అందించాల‌ని సంక‌ల్పించింది. సాంప్ర‌దాయ భోజ‌నంపై భ‌క్తుల అభిప్రాయాలు, సూచ‌న‌లు తీసుకుని సెప్టెంబ‌ర్ 8వ తేదీ వ‌ర‌కు టీటీడీ ప్ర‌యోగ‌త్మ‌కంగా నిర్వ‌హించ‌నుంది.

పూర్వికుల ఇలాగే చేసేశారు

పూర్వికుల ఇలాగే చేసేశారు

ఈ సంద‌ర్భంగా దేశీయ వ్య‌వ‌సాయ ప‌రిశోధ‌కులు విజ‌య‌రామ్ మాట్లాడుతూ మ‌న పూర్వీకులు మ‌న‌కు అందించిన గో ఆధారిత వ్య‌వ‌సాయంతో పండించిన దేశీయ బియ్యం, ప‌ప్పుదినుసులు, కూర‌గాయ‌లను టిటిడి కోనుగోలు చేయ‌డం అభినంద‌నీయమ‌న్నారు. దీనిద్వారా దేశీయ విత్త‌నాలు, దేశీయ గో జాతులను గ్రామ‌ల్లోకి పునః ప్ర‌వేశ‌పెట్టవ‌చ్చ‌న్నారు.

 ఇడ్లీలు, ఉప్మా

ఇడ్లీలు, ఉప్మా

అనంత‌రం చిరుధాన్యాల ఆహ‌ర నిపుణులు రాంబాబు మాట్లాడుతూ దేశీయ ఆవునెయ్యి, బెల్లం, గానుగ నూనెతో వంట‌లు వండి భ‌క్తుల‌కు వ‌డ్డిస్తున్న‌ట్లు తెలిపారు. ఇందులో భాగంగా గురువారం ఉద‌యం కుల్ల‌కారు బియ్యంతో ఇడ్డీలు, కారా బాత్ బియ్యంతో ఉప్మ త‌యారు చేసి అందించిన‌ట్లు తెలిపారు. ఇందులో శ‌రీరానికి అవ‌స‌ర‌మైన సూక్ష్మ పోష‌కాలు, అనేక వ్యాధుల‌ను ఎదుర్కొనే వ్యాధి నిరోద‌క శ‌క్తి ఉంటుంద‌న్నారు.

Recommended Video

    'Anjanadri' In Tirumala is Hanuman''s Birthplace ఆంజనేయుడి జన్మస్థలం ఎక్కడ.? || Oneindia Telugu
    కొబ్బరి అన్నం, పులిహోరా 14 రకాల వంటలు

    కొబ్బరి అన్నం, పులిహోరా 14 రకాల వంటలు


    మ‌ధ్యాహ్నం కొబ్బ‌రి అన్నం, పులిహోర‌, పూర్ణ‌లు, వ‌ర్ష రుతువులో తీసుకోవ‌సిన అహారమైన ప‌చ్చి పులుసు, దోశ‌కాయ ప‌ప్పు త‌దిత‌ర 14 ర‌కాల వంట‌కాలు చెఫ్ శ్రీ గోపి వండి భ‌క్తుల‌కు అందించిన‌ట్లు వివ‌రించారు. భ‌విష్య‌త్తులో ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారం తీసుకోవ‌డం వ‌ల‌న మ‌న ఆరోగ్యంతో పాటు రైతు సంక్షేమం, గో సంక్షేమం,దేశం కూడా ఆర్థికాభివృద్ధి చెందుతుంద‌న్నారు.
    ఈవో జవహర్ రెడ్డి వెంట టీటీడీ సివిఎస్వో గోపినాథ్ జెట్టి, డెప్యూటీ ఈఓ హరీంద్రనాథ్, బోర్డు మాజీ సభ్యులు శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+