TTD: భక్తలకు బ్రేక్ దర్శనం, వసతి మరింత సలభంగా - తాజా నిర్ణయం..!!
Tirumala: తిరుమల(Tirumala)లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వరుస సెలవులు..దసరా..బ్రహ్మోత్సవాల కారణంగా ఈ నెల మొత్తం రద్దీ ఎక్కువగా ఉంటుందని టీటీడీ(TTD) అంచనా వేస్తోంది. దీంతో, ఈ నెలలో శ్రీవారి దర్శనం కోసం జారీ చేసే ఎస్ఎస్డీ టోకెన్ల(SSD Token) జారీ నిలుపుదల చేయాలని టీటీడీ నిర్ణయించింది. ఇదే సమయంలో బ్రేక్ దర్శనం(Break Darshan).. వసతి (Accomidation)పొందే భక్తులకు వెసులుబాటు కలిగించేలా..సమయం కలిసొచ్చేలా టీటీడీ తాజాగా మరో నిర్ణయం తీసుకుంది.
భక్తులకు వెసులుబాటు:తిరుమల శ్రీవారి బ్రేక్ దర్శనం..వసతి పొందే భక్తులకు వెసులుబాటు కలిగిస్తూ టీటీడీ తాజాగా మరో నిర్ణయం అమలుకు సిద్దమైంది. బ్రేక్ దర్శనంతో పాటుగా వసతి టికెట్లు పొందే సమయంలో డబ్బు చెల్లించే విధానంలో మార్పు తీసుకొస్తోంది.

ఇందుకు పే లింగ్ సందేశాల ద్వారా సొమ్ము జమ చేసే అవకాశం కల్పించాలని నిర్ణయించింది. ప్రస్తుతం తిరుమలలోని సీఆర్వోలో శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను లక్కీ డిప్ లో కేటాయిస్తున్నారు. భక్తులు పే లింక్ ద్వారా నగదు చెల్లిస్తున్నారు. యాత్రికులు ప్రత్యక్షంగా కౌంటర్ వద్దకు వచ్చి టికెట్లు కొనాల్సిన ప్రయాస తప్పింది. ఇప్పుడు ఇదే విధానాన్ని ఇక నుంచి వీఐపీ బ్రేక్ దర్శనం, విచక్షణ కోటా ఆర్జిత సేవలు...సీఆర్వో పరిధిలోని గదుల కేటాయింపుకు వర్తించాలని టీటీడీ ఐటీ శాఖ ఆలోచన చేస్తోంది.
పే లింక్ విధానంతో:ప్రస్తుతం భక్తులు బ్రేక్ దర్శనాలకు దరఖాస్తు చేస్తే వారికి టికెట్ ఖరారు చేసిదీ, లేనిదీ సాయంత్రం తరువాత టీటీడీ నుంచి వారి రిజిస్టర్డ్ మోబైల్స్ కు సందేశం వస్తుంది. టికెట్ ఖరారైన తరువాత భక్తులు బ్రేక్ దర్శనం కోసం చేసుకున్న దరఖాస్తు రసీదు సందేశాన్ని చూపించి ఎంబీసీ -34 కౌంటర్ లో నగదు చెల్లించి టికెట్ పొందుతున్నారు. దీని కోసం రోజంతా తిరుమలలోనే గడపాల్సి వస్తోంది. బ్రేక్ దర్శనం కేటాయించకపోయినా రాత్రి వరకు నిరీక్షించాల్సి వస్తోంది. అదే పే లింక్ విధానం అమలు చేస్తే భక్తుల ఇబ్బందులను అధిగమించటంతో పాటుగా కొండపై రద్దీని తగ్గించవచ్చని టీటీడీ భావిస్తోంది. బ్రేక్ దర్శనం ఖరారైన భక్తులకు పే లింక్ ఎస్ఎంఎస్ పంపిస్తే వారు దాని పైన క్లిక్ చేసి సొమ్ము చెల్లించే అవకాశం కలుగుతుంది.

అధికారిక నిర్ణయం:తరువాత ఆనలైన్ లో టికెట్ పొంది..ప్రింట్ తీసుకొని నేరుగా దర్శనానికి వెళ్లేలా మార్పులు తీసుకొచ్చే అంశం పైన తుది కసరత్తు జరుగుతోంది. భక్తులు సీఆర్వోలో ఆధార్, మొబైల నెంబర్లు ఇస్తే గదుల లభ్యత ను బట్టి ఆ ఫోన్ నెంబర్ కు గది కేటాయిస్తూ పే లింక్ సందేశం పంపిస్తారు.
ఆన్ లైన్ లోనే గది అద్దె, కాషన్ డిపాజిట్ చెల్లించవచ్చు. తద్వారా విచారణ కార్యాలయాల వద్ద రద్దీ తగ్గుతుంది. దీని పైన ప్రస్తుతం ఐటీ అధికారులు ఉన్నతాధికారులు...పాలక మండలికి కొత్త విధానం ద్వారా ప్రయోజనాలను వివరిస్తున్నారు. ఈ విధానం అమల్లోకి తీసుకురావటం పైన త్వరలోనే అధికారికంగా నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది.
-
ఇక ఒక్క మిస్డ్ కాల్‌తో గ్యాస్ బుకింగ్: కొత్త నంబర్లు ఇవే! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..!












Click it and Unblock the Notifications