శ్రీవారి భక్తులకు అలర్ట్ : నేడు శ్రీవాణి దర్శన - ఆర్జిత సేవా టికెట్లు విడుదల..!!
తిరుమల శ్రీవారి భక్తుల శ్రీవాణి దర్శనంతో పాటుగా ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ ఈ రోజు ఆన్ లైన్ లో విడుదల చేస్తోంది.
Tirumala: శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక సమాచారం వెల్లడించింది. శ్రీవాణి దర్శన ..సేవా టికెట్లను ఈ రోజు భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తోంది. రానున్న వేసవిలో భక్తుల రద్దీ మరింతగా పెరిగే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేస్తోంది. దీనికి తగినట్లుగా ఏర్పాట్లకు సిద్దం అవుతోంది. కాటేజీల పునరుద్దరణతో పాటుగా తిరుమలలో కొత్త సదుపాయాలను అందుబాటులోకి తీసుకొస్తోంది. కొత్తగా శ్రీవారి పరాకమణి ద్వారా హుండీల లెక్కింపు ప్రారంభించింది. టీటీడీ తాజా ఆవిష్కరించిన యాప్ కు మంచి స్పందన కనిపిస్తోంది. ఇక.. ఈ రోజు శ్రీవారి సేవతో పాటుగా వసతి..అదే విధంగా సేవలకు సంబంధించిన టికెట్లను విడుదల చేయనుంది. వీటిని టీటీడీ వెబ్ సైట్ ..యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.
శ్రీవారి భక్తుల సౌకర్యార్దం ఈ నెల 23 నుంచి 28వ తేదీ వరకు శ్రీవాణి దర్శన టికెట్లు..వసతి గదులను ఈ రోజు మధ్నాహ్నం 3 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. నేటి మధ్నాహ్నం నుంచి టీటీడీ అధికారిక వెబ్ సైట్ తో పాటుగా తాజాగా ఆశిష్కరించిన TTDevathanams యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చని టీటీడీ ప్రకటించింది. అదే విధంగా ఈ నెల 22 నుంచి 28 వరకు గల శ్రీవారి ఆర్జిన సేవా టికెట్ల ఆన్ లైన్ డిప్ లో పాల్గొనేందుకు భక్తులు ఈ రోజు (బుధవారం) ఉదయం 10 నుంచి పదో తేదీ ఉదయం 10 గంటల వరకు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని టీటీడీ అధికారులు వెల్లడించారు. ఇక, ఈ నెల 22 నుంచి 28వ తేదీకి సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను ఈ రోజు (బుధవారం) మధ్నాహ్నం 12 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయనుంది.

ఇక, ఈ నెల 22 నుంచి 28వ తేదీ వరకు శ్రీవారి వర్చ్యువల్ కల్యాణోత్సవం, ఉంజల్ సేవల, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకర సేవా టికెట్లను రేపు (గురువారం) ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం వెబ్ సైట్ తో పాటుగా యాప్ అందుబాటులోకి రావటంతో భక్తులు ఆన్ లైన్ విధానం ద్వారా ఈ సేవా టికెట్లను పొందాలని టీటీడీ సూచించింది. జనవరి మాసం లో ముక్కోటి..రధసప్తమి వంటి ప్రత్యేక పర్వదినాలతో శ్రీవారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఇక.. తిరుమలలో వచ్చే డిసెంబర్ నాటికి యంత్రాల ద్వారా లడ్డూ ప్రసాదాల తయారీ ప్రారంభం కానుంది. గత ఏడాది కాలంలో తిరుమలలో గత నెలలో జరిగిన మక్కోటి నుంచి హుండీ ఆదాయం కొత్త రికార్డులు సాధించింది.












Click it and Unblock the Notifications