వైకుంఠ ఏకాదశి నాడు తిరుమలలో అత్యంత అరుదుగా..!!
తిరుపతి: వైకుంఠ ఏకాదశి నాడు- కలియుగ వైకుంఠంలా అలరారుతోన్న పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల భక్తులతో పోటెత్తింది. వేలాదిమంది స్వామివారిని దర్శించుకున్నారు. మొక్కులు చెల్లించుకున్నారు. అర్ధరాత్రి దాటిన తరువాత 1:30 గంటలకు శ్రీవారి దర్శనం మొదలైంది. నిరాటంకంగా కొనసాగింది. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని శ్రీవారు స్వర్ణరథంపై ఊరేగారు. శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారు నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనం ఇచ్చారు.

సర్వదర్శనం భక్తులకు..
సామాన్య భక్తులు ఎక్కువ మందికి వైకుంఠ ద్వార సర్వదర్శనం చేయించడానికి టీటీడీ అధికారులు ప్రత్యేక చర్యలను చేపట్టారు వైకుంఠ ఏకాదశి నాడే. ఉదయం 6 గంటలకే సర్వదర్శనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. సామాన్య భక్తుల దర్శనానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో వైకుంఠ ద్వార దర్శనం జరిగే 10 రోజులు కూడా ఎలాంటి సిఫారసు లేఖలను పరిగణనలోకి తీసుకోవట్లేదు. అలాంటి లేఖలపై స్వామివారి దర్శనాలను రద్దు చేశారు.

10 రోజుల పాటు..
అలాగే శ్రీవాణి టికెట్లు కూడా ఆఫ్ లైన్ లో రద్దు చేశారు. సామాన్య భక్తుల సౌకర్యం కోసం తిరుపతిలో తొమ్మిది ప్రాంతాల్లో స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీని టీటీడీ అధికారులు ప్రారంభించారు. టోకెన్ తీసుకునే వారికి నిర్దేశించిన సమయానికి తిరుమల క్యూ లైన్ లోకి రావాల్సి ఉంటుందని సూచించారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా సర్వదర్శనం భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకునేలా అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ 10 రోజుల పాటు సర్వదర్శనం భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవచ్చు.

హుండీ రికార్డు ఆదాయం..
శ్రీవారి హుండీ ఆదాయం రికార్డులు తిరగరాస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలోనే ఎప్పుడూ లేనివిధంగా కోట్ల రూపాయల మేర రాబడి వస్తోంది. వైకుంఠ ఏకాదశి నాడు ఒక్కరోజులోనే టీటీడీకి హుండీ ద్వారా అందిన ఆదాయం 7.68 కోట్ల రూపాయల. ఇంత భారీ ఎత్తున హుండీ ఆదాయం ఇదివరకెప్పుడూ లేదు. గత ఏడాది ఒక్కరోజు హుండీ ఆదాయం అత్యధికంగా 6.31 కోట్ల రూపాయలు. గత ఏడాది ఇది రికార్డయింది.

పాత రికార్డులన్నీ..
2012 ఏప్రిల్ 1వ తేదీన టీటీడీకి హుండీ ద్వారా అందిన ఒక్కరోజు ఆదాయం 5 కోట్ల 73 లక్షల రూపాయలు. ఆ తరువాత గత ఏడాది హుండీ రెవెన్యూ గరిష్ఠంగా 6.31 కోట్ల రూపాయలుగా నమోదైంది. ఇప్పుడది తెరమరుగైంది. సరికొత్తగా 7.68 కోట్ల రూపాయలుగా హుండీ రెవెన్యూ సరికొత్త రికార్డు సృష్టించింది.

2022లో..
2022లో కూడా శ్రీవారి హుండీ ఆదాయం రికార్డులను నెలకొల్పింది. 2022 జనవరి 1వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు తిరుమల హుండీ 1,451.15 కోట్ల రూపాయలు. 2021లో ఈ మొత్తం 833.41 కోట్ల రూపాయలకే పరిమితమైంది. హుండీ రెవెన్యూలో 74 శాతం పెరుగుదల నమోదైంది. 2022లో మొత్తం 11.42 కోట్ల లడ్డూలు అమ్ముడయ్యాయి. మూడు కోట్లకు పైగా భక్తులు అన్న ప్రసాదాన్ని స్వీకరించారు.
-
రూ.300 టికెట్లు లేకపోయినా శ్రీవారి దర్శనం- భక్తుల కోసం టీటీడీ కొత్త విధానం...!! -
పాలకోసం ఏడుస్తుందని పసిదాన్ని చంపేసిన తల్లి.. తిరుపతి జిల్లాలో దారుణం -
నేటి నుంచి ఒంటమిట్ట రాములోరి ఆలయంలో.. !! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !!












Click it and Unblock the Notifications