వైసీపీ మాజీ మంత్రికి భారీ షాక్
Jogi Ramesh: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, గృహ నిర్మాణ శాఖమాజీ మంత్రి జోగి రమేష్‌కు భారీ షాక్ తగిలింది. ఆయన ఇంటిపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేశారు. విస్తృతంగా తనిఖీలను నిర్వహిస్తోన్నారు. ఈ సందర్భంగా కొన్ని డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
విజయవాడ శివార్లలోని ఇబ్రహీంపట్నంలో నివసిస్తోన్నారు జోగి రమేష్. ఈ తెల్లవారు జామున 5 గంటల సమయంలో సుమారు 15 మంది ఏసీబీ అధికారులు, సిబ్బంది ఆయన నివాసంలో తనిఖీలు చేపట్టారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో గృహ నిర్మాణ శాఖలో భారీగా అక్రమాలు చోటు చేసుకోవడం, అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంపై ఫిర్యాదులు అందడం వల్లే ఈ దాడులకు దిగినట్లు చెబుతున్నారు.

అంబాపురంలో అగ్రిగోల్డ్ భూములను విక్రయించారనే ఆరోపణలను జోగి రమేష్ ఎదుర్కొంటోన్నారు. సీఐడీ అధికారుల ఆధీనంలో ఉన్నప్పటికీ కూడా అక్కడి అగ్రిగోల్డ్ భూములను ఆయన కోనుగోలు చేసి, విక్రయించారనే ఆరోపణలు ఇదివరకు వెల్లువెత్తిన విషయం తెలిసిందే.
అంబాపురం అగ్రిగోల్డ్ భూములను కబ్జా చేసి, వాటిని విక్రయించారని, దీని ద్వారా అయిదు కోట్ల రూపాయలను అక్రమంగా ఆర్జించారనేది జోగి రమేష్‌పై ఆరోపణలు ఉన్నాయి. అంబాపురంలో సర్వే నంబర్లు 69/2, 87లో అగ్రిగోల్డ్‌కు దాదాపు 2,300 గజాల భూమి ప్లాట్ల రూపంలో ఉండగా.. దాన్ని గతంలో సీఐడీ స్వాధీనం చేసుకుంది.
ఆ భూమిని జోగి రమేష్ సమీప బంధువులు తమ పేరు మీద బదలాయించుకున్నట్లు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై గతంలో జోగి రమేష్‌పై తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శలు గుప్పించారు. ఇప్పుడదే అంశం నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఆయన నివాసంపై దాడి చేసినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications