ycp ys jagan andhra pradesh amaravati kadapa ysrcp jagan guntur vijayawada tdp వైసిపి గుంటూరు విజయవాడ adiseshagiri rao
ఆది షాకింగ్ నిర్ణయం : అదే ఫైనలా : ఆయన రూటెటు..!
వైసిపి లో కలకలం. పార్టీని తొలి నుండి అంటిపెట్టుకొని ఉన్న సీనియర్ పార్టీని వీడే ఆలోచన. అధినేతకు దగ్గరగా ఉంటూనే..ప్రాధాన్యత కల్పించటం లేదని ఆవేదన. తనకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవటం లేదనే అసంతృప్తి. దీంతో..ఆయన పార్టీ వీడటం ఖాయమనే ప్రచారం. రంగంలోని దిగిన వైసిపి పెద్దలు. పాదయాత్ర ముగింపు సందర్భం లో వైసిపి ఆచి తూచి అడుగులు. ఆయన్ను బుజ్జగించే ప్రయత్నాలు ప్రారంభం..ఇంతకీ ఆయన రూటెటు....

వైసిపి ని వీడనున్న ఆదిశేషగిరి రావు..
నాడు వైయస్ తో..ఆ తరువాతి నుండి ఇప్పటి వరకు జగన్ తో కలిసి ఉన్న ఘట్టమనేని ఆదిశేషగిరి రావు వైసిపిని వీడా లని నిర్ణయించినట్లు సమాచారం. వైసిపి ఆవిర్భావం నుండి ఆయన జగన్ కు చేదోడు వాదోడు గా ఉన్నారు. 2019 ఎన్నికల్లో ఆది శేషగిరిరావు కు ఎంపీగా అవకాశం ఇస్తారని జగన్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అందుకు ఒప్పుకున్న ఆదిశేషగిరి రావు తనకు గుంటూరు నుండి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.
జగన్ పై ఆధ్యాత్మిక దాడి..! : హైందవ ద్వేషిగా ముద్రకు కుట్ర : నెపం మా పై నెట్టాలని..

వైసిపిని వీడాలని ఆదిశేషగిరి రావు
అయితే, పార్టీ అధినేత జగన్ మాత్రం విజయవాడ నుండి పోటీ చేయాలని ఆదిశేషగిరి రావుకు సూచిస్తున్నట్లుగా సమాచారం. దీంతో మన స్థాపానికి గురైన ఆయన వైసిపిని వీడాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు తో బంధుత్వం సైతం ఉన్న ఆదిశేషగిరి రావు వైసిపి వీడటం ఖాయమైతే టిడిపి లోకి వెళ్తారా అనే సందేహం కలుగుతోంది. ఇప్పటికే తన సోదరుడు కృష్ణ అల్లుడు గల్లా జయదేవ్ టిడిపి నుండి గుంటూరు ఎంపీగా ఉన్నారు. జయదేవ్ తల్లి అరుణ కుమా రి..టిడిపి లో క్రియా శీలకంగా వ్యవహరిస్తున్నారు. దీంతో..ఆది శేషగిరిరావు సైతం అటే వెళ్తారనే ప్రచారం మొదలైంది.

జగన్ జోక్యం.. వెనక్కు తగ్గుతారా..!
తన తో తొలి నుండి కలిసి ఉన్న ఆదిశేషగిరి రావు పార్టీని వీడాలనే ఆలోచన పార్టీ నేతలు జగన్ దృష్టికి తీసుకెళ్లారు. దీని పై జగన్ నేరుగా ఆదిశేషగిరి రావుతో మాట్లాడుతారని పార్టీ నేతలు చెబుతున్నారు. నాడు వైయస్ ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో ఆయనకు సన్నిహితంగా ఆదిశేషగిరిరావు ఉండేవారు. దీంతో..ఆదిశేషగిరిరావుకు అప్పట్లోనే ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ పదవి కట్టబెట్టారు. ఇక, వైయస్ మరణం తరువాత జగన్ తో సఖ్యతగా ఉంటున్న ఆదిశేషగిరిరావు..నంద్యాల ఎన్నికల సమయంలోనూ కృష్ణ- మహేష్ బాబు ఫ్యాన్స్ మద్దతు వైసిపి కే ఉంటుందంటూ అభిమాన సంఘాలతో చర్చించి..వారు ప్రకటన చేసేలా వ్యవహరించారు. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో తాను గుంటూరు స్థానం నుండి పోటీ చేయాలని ఆశిస్తున్నారు. మరి, జగన్ ఆయనను ఏ రకంగా బుజ్జగిస్తారో.. ఏం హామీ ఇస్తారో చూడాలి.