ఏపీపీఎస్సీ మెయిన్స్ షెడ్యూల్ లో సవరణ: పరీక్షలు జరిగేది ఈ తేదీల్లోనే: ఆ పోస్టులకు మాత్రం..!

పలు కేటగిరీ పోస్టుల భర్తీకి సంబంధించి మెయిన్స్ పరీక్షల నిర్వహణ పై ఏపీపీఎస్సీ షెడ్యూల్ ను ప్రకటించింది. 2018-19 సంవత్సరాల్లో నోటిఫై చేసిన 10 రిక్రూట్‌మెంట్లకు సంబంధించిన మెయిన్స్‌ పరీక్షల షెడ్యూల్‌ను ఏపీపీఎస్సీ సవరించింది. పాలనాపరమైన కారణాలవల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని కమిషన్‌ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు వివరించారు. జూనియర్‌ లెక్చరర్స్‌, పాలిటెక్నిక్‌ లెక్చరర్స్‌, డిగ్రీ కాలేజ్‌ లెక్చరర్స్‌, అసిస్టెంట్‌ బీసీ..సోషల్‌.

ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌, రాయల్టీ ఇన్‌స్పెక్టర్‌, సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్స్‌, టెక్నికల్‌ అసిస్టెంట్‌, అసిస్టెంట్‌ డైరెక్టర్‌, అసిస్టెంట్‌ కెమిస్ట్‌, టౌన్‌ ప్లానింగ్‌ అసిస్టెంట్‌ మెయిన్స్‌ షెడ్యూల్‌ను సవరించినట్టు తెలిపారు. అయితే గ్రూప్‌-1, ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్స్‌, డివిజినల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌, నాన్‌ గజిటెడ్‌ (పోస్టు కోడ్‌ నెం.3తో సహా) పోస్టులకు మాత్రం గతంలో ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారమే మెయిన్స్‌ జరుగుతాయని పేర్కొన్నారు.

APPSC annonced Re Scheduled dates for main exams for 10 recruitments

ఏపీపీఎస్సీ ప్రకటించిన తాజా తేదీల్లో పరీక్షలు జరగుతాయని కార్యదర్శి స్పష్టం చేసారు. అందులో భాగంగా జూనియర్ లెక్చరర్ల పరీక్ష..ఫిబ్రవరి 17 నుండి 20 వరకు జరగనుంది. అదే విధంగా పాలిటెక్నిక్ లెక్చరర్ల పరీక్ష మార్చి 12 నుండి 15వ తేదీ వరకు నిర్వహించనున్నారు. డిగ్రీ కాలేజీ లెక్చరర్లు పోస్టుల కోసం మార్చి 21,22 తేదీల్లో పరీక్ష ఉంటుంది. ఇక, అసిస్టెంట్ బీసీ..సోషల్..ట్రైబల్ సంక్షేమ అధికారుల పరీక్ష ఏప్రిల్ 15, 16 తేదీల్లో నిర్వహించాలని నిర్ణయించారు.

మైనింగ్ రాయల్టీ ఇన్స్పెక్టర్ పరీక్ష ఏప్రిల్ 16న, సివిల్ అసిస్టెంట్ సర్జన్ పరీక్ష ఏప్రిల్ 17న, టెక్నికల్ అసిస్టెంట్ (పీటీవో) పరీక్ష ఏప్రిల్ 17న, అసిస్టెంట్ డైరెక్టర్ (టౌన్ ప్లానింగ్) పరీక్ష ఏప్రిల్ 17, 18 తేదీల్లో నిర్వహించనున్నారు. అదే విధంగా అసిస్టెంట్ కెమిస్ట్ (గ్రౌండ్ వాటర్ సర్వీస్) కోసం ఏప్రిల్ 17, 18 తేదీల్లో పరీక్ష ఉంటుంది. టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ కోసం నిర్వహించే పరీక్ష ను ఏప్రిల్ 17, 18 తేదీల్లో నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+