రజనీకాంత్ కు బాలయ్య స్వాగతం - చంద్రబాబు సైతం, ఒకే వేదికపై..!!

సూపర్ స్టార్ రజనీకాంత్ విజయవాడకు చేరుకున్నారు. నందమూరి బాలకృష్ణ గన్నవరం విమానాశ్రయంలో రజనీకాంత్ కు స్వాగతం పలికారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా జరిగే కార్యక్రమంలో రజనీకాంత్ పాల్గొంటున్నారు. ఈ సాయంత్ర విజయవాడలో జరిగే ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబుతో సహా పలువురు ప్రముఖులు హాజరవుతున్నారు. రజనీకాంత్..చంద్రబాబు..నందమూరి బాలకృష్ణ ఒకే వేదిక మీదకు వస్తుండటంతో ఈ సమావేశం పైన ఆసక్తి కనిపిస్తోంది.

విజయవాడలో రజనీకాంత్:తెలుగుదేశం పార్టీ..నందమూరి కుటుంబం ఎన్టీఆర్ శత జయంతి వేడుకలను రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నిర్వహిస్తారు. మొత్తం వంద సభల నిర్వహణకు నిర్ణయించారు. పార్టీ పరంగా ఈ ఏడాది రాజమండ్రిలో జరిగే మహానాలు ఎన్టీఆర్ వందో పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు సిద్దం చేస్తున్నారు. ఇటు నందమూరి ఫ్యామిలీ వంద కార్యక్రమాలను కొనసాగిస్తోంది. ఎన్టీఆర్ నటించిన సినిమాల ప్రదర్శనతో పాటుగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇప్పుడు ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో భాగంగా జరిగే సభలో తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ ప్రత్యేక అతిధిగా హాజరవుతున్నారు. ఇందు కోసం విజయవాడ వచ్చిన రజనీకాంత్ కు బాలయ్యతో పాటుగా నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు.

Balakrishna welcomes Rajinikanth at Gannavaram
Photo Credit:

ఎన్టీఆర్ శత జయంతి సభ:విజయవాడ పోరంకిలోని అనుమోలు గార్డెన్స్‌లో ఈ సాయంత్రం సభ జరగనుంది. రజనీకాంత్ ప్రత్యేక అతిధిగా వస్తుండటంతో ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. అనుమతి ఉన్నవారికి మాత్రమే ప్రవేశం ఉంటుందని నిర్వహకులు స్పష్టం చేసారు. కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ నటించిన సినిమాల్లోని ప్రముఖ సన్నివేశాలతో పాటుగా, ఎన్టీఆర్ ఏవీని ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. ఎన్టీఆర్ కల్చరల్ టీం ప్రత్యేక కార్యక్రమాలను సిద్దం చేసింది.ఎన్టీఆర్ లిటరేచర్, సావనీయర్ అండ్ వెబ్సైటు కమిటీ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ అసెంబ్లీ..చారిత్రిక ప్రసంగాల ఆవిష్కరణ జరుగుతుందని నిర్వహకులు ప్రకటించారు. రజనీకాంత్ ఆవిష్కరణ చేయనున్నారు.

ఒకే వేదిక మీదకు ముగ్గురు:పుస్తకాల ఆవిష్కరణ తరువాత సభలో రజనీకాంత్ ప్రసంగం ఉంటుంది. ఎన్టీఆర్ తో తన అనుబంధంతో పాటుగా నందమూరి కుటుంబం, చంద్రబాబుతో తన సాన్నిహిత్యం గురించి రజనీకాంత్ ప్రసంగించనున్నారు. రజనీకాంత్ కు స్వాగతం పలికిన బాలయ్య సాయంత్రం జరిగే సభలో కీలక ఉపన్యాసం చేయనున్నారు. అదే విధంగా చంద్రబాబు సైతం తనకు రజనీకాంత్ తో ఉన్న సాన్నిహిత్యంతో పాటుగా ఎన్టీఆర్ శతజయంతి వేళ నిర్వహిస్తున్న కార్యక్రమాలు, ఎన్టీఆర్ జీవిత విశేషాలను సభికులతో పంచుకోనున్నారు. ప్రముఖ వ్యక్తులు ఒకే వేదిక మీదకు రానుండటంతో ఈ కార్యక్రమం పైన టీడీపీ కార్యకర్తలతో పాటుగా నందమూరి అభిమానుల్లో ఉత్సాహం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+