నూజివీడు చిన్నారి అత్యాచార ఘటన: బిర్యానీ ప్యాకెట్‌ మృగాడిని పట్టించింది..ఎలాగంటే..?

నూజివీడు: ముక్కుపచ్చలారని చిన్నారులపై కామాంధులు రెచ్చిపోతున్నారు. కామంతో కళ్లు కానరాక వికృత చర్యకు దిగుతున్నారు. కూతురు వయస్సున చిన్నారులపై మృగాళ్లు జంతువు కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు. ఆడపిల్ల ఎక్కడ ఒంటరిగా కనిపిస్తుందా.. ఎప్పుడు లైంగిక వాంఛ తీర్చుకుందామా అన్నట్లుగా కొందరు మొగాళ్లు కాచుకూర్చుంటున్నారు. బుధవారం ఆంధ్రప్రదేశ్‌లోని నూజివీడు ఐఐటీ దగ్గర ఓ ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన మృగాడిని పోలీసులు పట్టుకున్నారు.

నిందితుడు ఆటో డ్రైవర్‌గా గుర్తింపు

నిందితుడు ఆటో డ్రైవర్‌గా గుర్తింపు

బుధవారం రోజు రాత్రి 9:30 గంటల ప్రాంతంలో నూజివీడు ట్రిపుల్ ఐటీ దగ్గర ఓ మూడవ తరగతి చదువుతున్న ఎనిమిదేళ్ల బాలికను అత్యాచారం చేసి పరారైన వ్యక్తిని నూజివీడు పోలీసులు శుక్రవారం తెల్లవారు జామున అరెస్టు చేశారు. అతన్ని ఆటోడ్రైవర్‌ అన్నం వెంకటేశ్వర రావుగా గుర్తించారు. అయితే తప్పు చేసిన వాడు ఏదో ఒక క్లూ వదిలి పోతాడనేది చాలా సందర్భాల్లో రుజువైంది. ఈ ఘటనలో కూడా అలాంటిదే జరిగింది. తనతో పాటు తెచ్చుకున్న బిర్యానీ ప్యాకెట్ నిందితుడిని పట్టించింది.

 తండ్రి కోసం వేచిచూస్తుండగా...

తండ్రి కోసం వేచిచూస్తుండగా...

బుధవారం రోజు రాత్రి నూజివీడు ట్రిపుల్ ఐటీ దగ్గర మూడవ తరగతి చదువుతున్న ఎనిమిదేళ్ల బాలిక తన తండ్రి కోసం ఎదురుచూస్తుండగా అటుగా సైకిల్ పై వచ్చిన వ్యక్తి తాను ఇంటికి చేరుస్తానని నమ్మబలికి బాలికను నిర్మానుష్య ప్రాంతంకు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం ఆ చిన్నారిని అక్కడే వదిలేసి పారిపోయాడు. చిన్నారికి ఏంచేయాలో తెలియక ఏడుస్తూ ఉండగా అదే సమయంలో పోలీసులు అటుగా ప్యాట్రోలింగ్ చేస్తుండగా బాలిక కనిపించింది. జరిగిన విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఆ చిన్నారిని హాస్పిటల్‌కు చికిత్స కోసం పంపించి తల్లిదండ్రులకు కబురు పెట్టారు. స్వల్ప గాయాలవడంతో చిన్నారికి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉందని పోలీసులు చెప్పారు.

 ఘటనా స్థలంలో బిర్యానీ ప్యాకెట్

ఘటనా స్థలంలో బిర్యానీ ప్యాకెట్

ఇక నిందితుడి గురించి తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ముందుగా ఘటనా స్థలంను పరిశీలించారు పోలీసులు. అక్కడ ఓ బిర్యానీ ప్యాకెట్ వారికి తారసపడింది. ఇదే నిందితుడిని పట్టించింది. బిర్యానీ ప్యాకెట్‌పై ఉన్న హోటల్ పేరు ఆధారంగా ఆ రెస్టారెంట్‌కు పోలీసులు వెళ్లారు. అక్కడ ఉన్న సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించారు. అందులో నిందితుడు వెంకటేశ్వరరావు సైకిల్ పై వచ్చి బిర్యానీ ప్యాకెట్ తీసుకెళ్లాడు. ఇదే విషయాన్ని బాలికను అడుగగా ఓ వ్యక్తి సైకిల్‌పై వచ్చినట్లు చెప్పింది. దీంతో కేసును సగం పరిష్కరించారు పోలీసులు. ఇక మరికొందరిని విచారణ చేసిన పోలీసులు వచ్చిన వ్యక్తి పేరు అన్నం వెంకటేశ్వరరావు అని అతను ఆటోడ్రైవర్ అని చెప్పారు.

Recommended Video

    YSR Kanti Velugu Scheme Launch : Student Jyothirmayi Speech Going Viral | Oneindia Telugu
     శుక్రవారం ఉదయం వెంకటేశ్వరరావు అరెస్టు

    శుక్రవారం ఉదయం వెంకటేశ్వరరావు అరెస్టు

    పూర్తి వివరాలు సేకరించిన పోలీసులు శుక్రవారం ఉదయం నేరుగా అన్నం వెంకటేశ్వరరావు ఇంటికి వెళ్లి పట్టుకుని అరెస్టు చేశారు. అంతేకాదు ఇంటిని సోదా చేయగా అత్యాచారం జరిగిన రాత్రి ధరించిన బట్టలు కూడా కనిపించాయి. సీసీ ఫుటేజీలో కనిపించిన బట్టలు కూడా ఇవే కావడం.. బయట సైకిల్ ఉండటంతో ఇక నిందితుడు వెంకటేశ్వరరావు అని నిర్థారణకు వచ్చారు పోలీసులు. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయగా నేరంను ఒప్పుకున్నాడు నిందితుడు అన్నం వెంకటేశ్వరరావు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+