చంద్రబాబు చిన్న మెదడు చిట్లిందా..? టీడీపీ చీఫ్‌పై బొత్స విసుర్లు

టీడీపీ చీఫ్ చంద్రబాబుపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఓ రేంజ్‌లో ఫైరయ్యారు. చంద్రబాబు తాను ఇంకా సీఎం అనే భ్రమలో ఉన్నారని పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వం మారి వైసీపీ సర్కార్ కొలువుదీరిందనే విషయం మరచిపోయారని విమర్శించారు. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే కఠినచర్యలు తప్పవని బొత్స సత్యనారాయణ హెచ్చరించారు. ఓ వ్యక్తిని, సంస్థను కించపరిస్తే ఏం చేయాలని ప్రశ్నించారు. చంద్రబాబు వైఖరి మాత్రం మారకపోవడం అనుమానాలకు తావిస్తుందన్నారు. చంద్రబాబు చిన్నమెదడుకు ఏమైందో తెలియడం లేదన్నారు. కొంపదీసి చిట్లిపోయిందా ? అందుకోసం తానే సీఎం అన్నట్టు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.

botsa criticize tdp chief chandrababu naidu

చంద్రబాబు చెప్తున్న అసభ్యకర పోస్టులపై తమకు అనుమానం ఉందని బొత్స అన్నారు. అవి నిజమైనవో కావో తేలాలని గుర్తుచేశారు. లేదంటే ఊరికే చర్యలు తీసుకోబోమన్నారు. తప్పులు చేస్తే బెదిరిస్తే భయపడబోమని తేల్చిచెప్పారు. నవ్యాంధ్ర అభివృద్ధిలో దూసుకెళ్తుందని చెప్పారు. అభివృద్ధిలో నిర్మాణరంగం కీలకమని గుర్తుచేశారు. బీపీఎస్ విధానాన్ని తాము ప్రోత్సహించబోమన్నారు. రాష్ట్రంలో ఇసుక విధానానికి త్వరలో పరిష్కారం కనుగొంటామని తెలిపారు. కొత్త పాలసీ వల్ల తాత్కాలికంగా ఇబ్బందులు వస్తాయని.. కానీ శాశ్వత పరిష్కారం లభిస్తోందని తెలిపారు. మరోవైపు భారీ వర్షాల వల్ల రీచ్‌లు పూర్తిగా ప్రారంభమవ్వలేదని గుర్తుచేశారు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+