సీఎం జగన్ బావ బ్రదర్ అనిల్‌ కుమార్‌కు కారు ప్రమాదం..

Recommended Video

    సీఎం జగన్ బావ బ్రదర్ అనిల్‌ కుమార్‌కు కారు ప్రమాదం..!!

    క్రైస్తవ మత ప్రబోధకుడు,ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బావ బ్రదర్ అనిల్ కుమార్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. కృష్ణా జిల్లా జగ్గయ్యపాడు మండలం గరికపాడు సమీపంలో ఆయన వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కనున్న గుంతలోకి దూసుకెళ్లింది. అయితే ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో బ్రదర్ అనిల్ క్షేమంగా బయటపడ్డారు. డ్రైవర్,గన్‌మెన్లకు స్వల్ప గాయాలైనట్టు సమాచారం. ప్రమాదంలో కారు ముందు భాగం దెబ్బతిన్నది.

    brother anil kumar car met with accident in krishna district

    ప్రమాదం గురించి తెలియగానే జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను సంఘటనా స్థలానికి వెళ్లారు. బ్రదర్ అనిల్,ఆయన గన్‌మెన్లను మరో కారులో అక్కడినుంచి విజయవాడలోని ఎం జె. నాయుడు ఆస్పత్రికి పంపించారు. ప్రథమ చికిత్స అనంతరం అక్కడినుంచి వారు వెళ్లిపోయారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

    గతంలోనూ ఓసారి బ్రదర్ అనిల్ కుమార్ కారు ప్రమాదానికి గురైంది. ఆరేళ్ల క్రితం పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న కారు ఆగి వున్న ఓ లారీని ఢీకొట్టింది. ఆ ప్రమాదంలో అనిల్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పశ్చిమ గోదావరిలో ప్రార్థనా సభలు నిర్వహిస్తూ జిల్లాలోని అనేక ప్రాంతాల్లో పర్యటిస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+