చంద్రబాబు లేఖాస్త్రం: జగన్ సర్కార్ వేధింపులు, అరెస్టులపై గవర్నర్‌కు లేఖ
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ వేధింపులపై జోక్యం చేసుకోవాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కోరారు. చట్ట విరుధ్దంగా అరెస్ట్ చేస్తూ.. విపక్ష నేతలను వేధిస్తున్నారని తెలిపారు. ఈ మేరకు గవర్నర్‌కు చంద్రబాబు లేఖ రాశారు. అధికార పార్టీ నేతలతో కొందరు పోలీసులు అనుకూలంగా పనిచేస్తున్నారని ఆరోపించారు.
రాష్ట్రంలో ప్రాథమిక హక్కుల పునరుద్ధరించాల్సిన అసవరం ఉందన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19ను జగన్ సర్కార్ యధేచ్ఛగా ఉల్లంఘిస్తుందని తెలిపారు భావ ప్రకటనా స్వేచ్ఛను హరించివేయడం సరికాదన్నారు. సోషల్ మీడియాలో పోస్టులు చేసేవారిపై పోలీసులు దారుణంగా ప్రవర్తిస్తున్నారని వివరించారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం, నాయుడుపాలెనికి చెందిన సందీప్ కుమార్, తొట్టెంపూడి చంద్రశేఖర్‌ను జూలై 16వ తేదీన అరెస్టు చేశారని గుర్తుచేశారు.

Recommended Video
ఏపీ మంత్రి బాలినేనికి సంబంధించి ఏపీలోనే కాదు తమిళనాడు మీడియాలో ప్రసారం అయ్యాయి. కానీ సందీప్, చంద్రశేఖర్‌ను మాత్రం పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరిని ఒంగోలు గ్రామీణ పోలీసులు ఒక పోలీస్ స్టేషన్ నుంచి మరొ పోలీస్ స్టేషన్‌కు తిప్పుతూ హింసించారని తెలిపారు. ఏపీ నుంచి భారీగా నగదు అక్రమంగా రవాణా చేస్తున్న నిందితులపై సమగ్ర విచారణ చేయాల్సింది పోయి.. అమాయకులను అరెస్ట్ చేయడం ఏంటీ అని పేర్కొన్నారు. దీనిని బట్టి ప్రభుత్వ చర్యలు అర్థమవుతున్నాయని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు జోక్యం చేసుకోవాలని చంద్రబాబు నాయుడు కోరారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications