• search
 • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

పీ.కే కు సీఎం జగన్ కొత్త బాధ్యతలు..!!: నమ్ముకున్న టీం ఏమైంది : ఏం చేయబోతున్నారు..!

|

వైసీపీని అధికారంలోకి తీసుకురావటంతో జగన్ కు కలిసి వచ్చిన ప్రశాంత్ కిషోర్ టీం సేవలను మరో సారి వినియోగించుకోవాలని సీఎం భావిస్తున్నారు. అందు కోసం కొత్త బాధ్యతలు అప్పగించేందుకు చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా ఆరు నెలల కాలంలో ఇచ్చిన హామీల మేరకు పధకాలను అమలు చేస్తున్నా..ఆశించిన స్థాయిలో మైలేజ రాలేదని వైసీపి అధినాయకత్వం భావిస్తోంది. అందునా జాతీయ స్థాయిలో జగన్ నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రచారం చేయటంతో టీడీపీ సక్సెస్ అవుతోంది. ఇక, రాష్ట్ర స్థాయిలోనూ విపక్షాలు కలిసి పని చేయకపోయినా..విడివిడిగానే ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తున్నారు. దీంతో.. ఇప్పటి వరకు పధకాల అమల్లో ప్రజల ఫీడ్ బ్యాక్ కోసం మాత్రమే సేవలు అందిస్తున్న పీకే టీం..ఇక.. తమ నిర్ణయాల ద్వారా ఇమేజ్ పెంచుకొనే అంశం పైన ఫోకస్ చేసారు. ఈ ప్రచారాన్ని అటు జాతీయ స్థాయి లో ..ఇటు రాష్ట్రంలో మరింత మైనస్ గా మారకముందే..కొత్త వ్యూహాలతో రంగంలోకి దిగాలని భావిస్తోంది. దీని కోసం..ఇప్పుడు పీకే టీంకు బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించినట్లు సమాచారం.

హౌడీ మోడీ ప్రోగ్రామ్‌పై ప్రశాంత్ కిషోర్ స్పందన..ఏమన్నారంటే ?

మంచి చేస్తున్నా డామేజ్ చేస్తున్నారు..

మంచి చేస్తున్నా డామేజ్ చేస్తున్నారు..

ముఖ్యమంత్రి జగన్ తన పైన జరుగుతున్న వ్యతిరేక ప్రచారం పైన కీలక మంత్రుల వద్ద అసహనం..ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల కాలంలోనే ఇన్ని హామీలు అమలు చేస్తూ.. అవినీతి రహత పాలన దిశగా సంస్కరణలు తీసుకొస్తున్నా ఇంతలా వ్యతిరేకంగా ప్రచారం జరగటం పైన జగన్ ఆవేదనతో ఉన్నట్లుగా తెలుస్తోంది. ముందు నుండి రాజకీయంగా..మీడియా పరంగా జగన్ వ్యతిరేకులతో పాటుగా ఇప్పుడు జాతీయ మీడియాలో వ్యతిరేక కధనాలు..ఏపీలో డామేజింగ్ కంట్రోల్ చేయటంతో తాను నమ్ముకున్న టీం సమర్ధవంతంగా వ్యవహరించలేకపోతుందనే భావనలో ముఖ్యమంత్రి ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో..తాజాగా తాను ఏరి కోరి తెచ్చుకొని కీలక పదవి అప్పగించి..కోరినవన్నీ సమకూర్చిన వ్యక్తి పైన సీఎం ఫైర్ అయినట్లు సమాచారం.

ప్రశాంత్ కిషోర్ టీం సేవల కోసం..

ప్రశాంత్ కిషోర్ టీం సేవల కోసం..

ఎన్నికల్లో గెలవటానికి జగన్ కు పీకే టీం అందించిన రాజకీయ వ్యూహాలు మేలు చేసాయి. ఇక, అధికారంలోకి వచ్చిన తరువాత కూడా తనకు పీకే టీం సేవలు కొనసాగించాలని జగన్ కోరారు. కొన్ని అంశాల్లో మాత్రమే వారు క్షేత్ర స్థాయిలో ప్రజల ఫీడ్ బ్యాక్ పైన మాత్రం నివేదిక ఇప్పటి వరకు అందిస్తున్నారు. అయితే, జగన్ పాలనా పరమైన నిర్ణయాల ద్వారా ప్రజల్లో సానుకూల వాతావరణం కల్పించటం.. జాతీయ .. రాష్ట్ర స్థాయిలో జగన్ నిర్ణయాల పైన జరుగుతున్న వ్యతిరేక ప్రచారానని ఎదుర్కోవటం పైనే పీకే తో జగన్ కోర్ టీం చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రాంతీయ మీడియాలో జగన్ కు వ్యతిరేకంగా పని చేయటం చాలా కాలంగా ఉన్నా..జాతీయ మీడియాలో కనిపిస్తున్న మార్పు పైనే ఇప్పుడు ఎక్కువగా ఫోకస చేస్తున్నారు. విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నా..జగన్ ను లక్ష్యంగా చేసుకొని జాతీయ స్థాయిలో కధనాలు వస్తున్నాయి. మొత్తంగా ప్రభుత్వం డామేజ్ కాకుండా..ఇమేజ్ పెంచే వ్యూహాల బాధ్యతలను పీకే టీంకు అప్పగిస్తున్నట్లు తెలుస్తోంది.

  AP Government Said A Good News For Farmers,Here Is the Full Details ! || Oneindia Telugu
  పరిశ్రమలు రావు..ఏపి బ్రాండ్ దెబ్బ తిన్నదంటూ

  పరిశ్రమలు రావు..ఏపి బ్రాండ్ దెబ్బ తిన్నదంటూ

  ఇక, జగన్ ముఖ్యమంత్రి అయిన ఈ ఆరు నెలల కాలంలో అనేక సంస్థలు ఏపీ నుండి వెళ్లిపోయాయంటూ అనేక రకాలుగా ప్రచారం సాగుతోంది. ప్రభుత్వం నుండి దీని పైన ట్విట్టర్ ద్వారా ఖండనలు మినహా ప్రజలకు అర్దమయ్యేలా వివరించటంలో విఫలమవుతున్నారు. ఇక, ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ప్రచారం ప్రజలు నమ్మటం లేదంటూ ముఖ్యమంత్రి వద్ద చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, ఆర్దికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నా ఇన్ని పధకాలు అమలు చేస్తున్నా..ప్రభత్వం మీద జరుగుతన్న ప్రచారం హైలైట్ అవ్వటం పైన పార్టీ సీనియర్లు మౌనంగా పాటిస్తున్నారు. ఇంతమంది సలహాదారులు.. అనేక మందిని కీలక బాధ్యల్లోకి తీసుకున్నా..ప్రభుత్వానికి ప్రయోజనం కలిగే విధంగా యాక్టివ్ గా వ్యవహరించటం లేదనే అభిప్రాయం పార్టీ ముఖ్యుల్లో వ్యక్తం అవుతోంది. అదే సమయంలో మంత్రులు..ఎమ్మెల్యేలు సైతం తాము కేడర్ కు ఏం చేయలేకపోతున్నామని వాపోతున్నారు. దీంతో..ఈ మొత్తం పరిస్థితుల మార్పు దిశగా ముఖ్యమంత్రి ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగానే పీకే టీం సేవలు వినియోగించు కోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

  English summary
  CM Jagan want to utilise tht Prasanth Kishore team services to promote his flagship programmes and Govt image.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X