100 రోజుల్లో చేసిందేంటీ ? ఏపీ సీఎం జగన్‌పై దేవినేని ఫైర్
అమరావతి : ఏపీ సీఎం జగన్‌పై ఓ రేంజ్‌లో ఫైరయ్యారు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. ఏపీలో పాలన తిరోగమనంలో సాగుతుందని విమర్శించారు. విపక్షాలపై సీఎం జగన్ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో తాము హుందగా ప్రవర్తించామని గుర్తుచేశారు దేవినేని.
ఏపీలో పాలన రివర్స్ నడుస్తోందని సెటైర్లు వేశారు దేవినేని ఉమామాహేశ్వరరావు. విపక్షాలు అంటే చిన్నచూపు అని విమర్శించారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు ఎందుకు నిలిపివేశారో అర్తం కావడం లేదన్నారు. దానికి సీఎం జగన్ కారణం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఈ 100 రోజుల్లో రాష్ట్రానికి జగన్ ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. ఎక్కడ చూసినా తమ హయాంలో జరిగిన అభివృద్ధి పనులే కనిపిస్తున్నాయని తెలిపారు. రివర్స్ టెండరింగ్ ద్వారా 10 శాతం తక్కువకు పనులు జరిగాయని పేర్కొన్నారు. కానీ గత ప్రభుత్వంపై మాత్రం అవినీతి ఆరోపణలు చేశారని గుర్తుచేశారు. తమపై బురద జల్లేందుకు తెగ ఆరాటపడ్డారని విమర్శించారు.












Click it and Unblock the Notifications