విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆ వీడియో ఏ ల్యాబ్‌కు చేరింది.. మాధవ్ ఇష్యూపై వర్ల రామయ్య సందేహాలు

|
Google Oneindia TeluguNews

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ దుమారం రేపుతోంది. దీనిపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. తాజాగా టీడీపీ నేత వర్ల రామయ్య స్పందించారు. సీఎం జగన్‌కు పలు ప్రశ్నలు వేశారు. సదరు ఎంపీపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారని అడిగారు. సొంత పార్టీకి చెందిన నేతలపై ఆరోపణలు వైసీపీని ఇరకాటంలో పడేశాయి.

ఫోరెన్సిక్ ల్యాబ్..

ఫోరెన్సిక్ ల్యాబ్..

ఎంపీ మాధవ్ బూతు వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించామని సజ్జల రామకృష్ణారెడ్డి చెబుతున్నారు. అయితే ఆ వీడియోను ఏ ల్యాబ్ కు పంపారు? ఏ పోలీస్ స్టేషన్ నుంచి ఏ అధికారి పంపారు? ఏ ఏ సెక్షన్‌లతో కేసు నమోదు చేశారు? అసలు ఆ బూతు వీడియో ఫోరెన్సిక్ ల్యాబ్‌కు చేరిందా, లేదా? చేరితే... ఎప్పుడు చేరింది?" అంటూ వర్ల రామయ్య ప్రశ్నలు వేశారు.

కఠిన చర్యలు

కఠిన చర్యలు

వీడియో ఉదంతంపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఆ వీడియో నిజమని తేలితే ఎంపీ గోరంట్ల మాధవ్ పై కఠిన చర్యలు ఉంటాయని వెల్లడించారు. ఇతరులకు గుణపాఠంలా యాక్షన్ ఉంటుందని స్పష్టం చేశారు. గోరంట్ల మాధవ్ వ్యవహారంలో విచారణ జరిపి వాస్తవాలు వెలికితీయాలని ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి లేఖ రాసిన సంగతి తెలిసిందే.

సందేహాలు

సందేహాలు

గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. ఇతర నేతల పేర్లు కూడా బయటకు వస్తున్నాయి. దీంతో వైసీపీ ప్రభుత్వం గట్టి చర్యలే తీసుకునేలా ఉంది. వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించామని చెబుతుంది. నిజమని తేలితే.. కఠిన చర్యలు అని సజ్జల ఇప్పటికే స్పష్టంచేశారు. ఈ క్రమంలోనే వర్ల రామయ్య పలు సందేహాలను లేవనెత్తారు.

English summary
did video reached forensic lab tdp leader varla ramaiah asked to cm ys jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X