Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

vijayawada murder : మహిళ కోసం గొడవ- పక్కాప్లాన్‌తో కిరాతకంగా హత్య

ఇవాళ మధ్యాహ్నం విజయవాడలోని దుర్గా అగ్రహారంలో జరిగిన దారుణ హత్య దర్యాప్తులో పోలీసులు పురోగతి సాధించారు. పట్టపగలు నడిరోడ్డుపై కత్తులతో ఓ వ్యక్తిని దారుణంగా పొడిచి చంపిన ఘటనపై సీసీటీవీ ఫుటేజ్‌తో పాటు ఇతర ఆధారాల సాయంతో దర్యాప్తు జరుపుతున్న నగర పోలీసులు నిందితులను గుర్తించారు.

విజయవాడ దుర్గా అగ్రహారంలో వ్యక్తి దారుణ హత్యకు ఓ మహిళ కారణమని పోలీసులు గుర్తించారు. ఆ మహిళ విషయంలో జరిగిన గొడవలే అంతిమంగా అతన్ని కిరాతకంగా హతమార్చేందుకు కారణమైనట్లు వారు తేల్చారు. ఓ మహిళ విషయంలో కొంతకాలంగా ఇద్దరి మధ్య వివాదం జరుగుతున్నట్లు తెలిసింది. దీంతో ఇందులో ఒకరిని మరో వ్యక్తి, అతని స్నేహితులు కలిసి హతమార్చినట్లు తెలుస్తోంది. పక్కా ప్లాన్‌ ప్రకారమే ఈ హత్య జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు.

dispute for women behind vijayawada durga agraharam murder

విజయవాడలోని కండ్రిగకు చెందిన రౌడీ షీటర్ కుక్కల రవి, హేమంత్‌, కరీం అనే వ్యక్తులు ఈ దారుణ హత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. వీరిలో ఒకరిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. విచారణలో మహిళకు సంబంధించిన వివాదమే హత్యకు కారణంగా తేల్చారు. దీంతో మిగతా నిందితుల్ని కూడా పట్టుకునేందుకు గాలింపు కొనసాగుతోంది. ఇవాళ నగరంలో పట్టపగలు జరిగిన ఈ హత్యతో జనం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సాయంత్రానికి దర్యాప్తులో పురోగతి సాధించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+